భార్య అంటే భర్తలో సగం అంటారు, రాజమౌళి భార్య రమా రాజమౌళి ఇందుకు చక్కని ఉదాహరణ. రాజమౌళి విజయాలలో ఆమె భాగం కూడా కొంత ఉంది. ప్రపంచ గుర్తింపు తెచ్చుకున్న బాహుబలి చిత్రాలకు రమా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు. కథలో పాత్రలకు తగ్గట్టుగా, ఆ కాలాన్ని ప్రతిబింబించేలా రమా రాజమౌళిగారు అద్భుతంగా కాస్ట్యూమ్ రూపిందించడం జరిగింది.  హీరో ప్రభాస్, స్వీటీ అనుష్క అద్బుతంగా తెరపై కనిపించడం వెనుక ఆమె కృషి ఎంతో ఉంది. 

కాగా రాజమౌళి లేటెస్ట్ ప్రాజెక్ట్ ఆర్ ఆర్ ఆర్ కి కూడా రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ 1920కాలం నాటి పీరియాడిక్ మూవీ కాగా అందుకు అనుగుణంగా ఆమె చరణ్ మరియు ఎన్టీఆర్ మరియు ఇతర కీలక పాత్రల కాస్ట్యూమ్ డిజైన్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఆర్ ఆర్ ఆర్ కొరకు కాస్ట్యూమ్ డిజైనర్ వ్యవహరించిన రమా రాజమౌళి, రచయిత బాధ్యతలు తీసుకున్నారట. ఆర్ ఆర్ ఆర్ లో కొన్ని సన్నివేశాలకు ఆమె డైలాగ్స్ రాస్తున్నారని సమాచారం అందుతుంది. రామా రాజమౌళి చేపట్టిన ఈ కొత్త బాధ్యతకు అందరూ భేష్ అంటున్నారు. 

ఇక ఆర్ ఆర్ ఆర్ కథను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందించగా, స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడు, సొంత అన్నయ్య అయిన కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ఇటీవలే కరోనా బారినపడి కోలుకున్న రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ పై ద్రుష్టి సారించారు. ఈ మూవీ షూటింగ్ మొదలుపెట్టడానికి అందుబాటులో ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ విదేశాలలో కూడా జరిపే ఆలోచనలో ఆయన ఉన్నట్లు వినికిడి.