కెరీర్ మొదట్లో వరుసగా సక్సెస్ లు అందుకున్న యువ హీరో రాజా తరుణ్ ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇటీవల కారు యాక్సిడెంట్ దుమారం యువ హీరో కెరీర్ ని గట్టి దెబ్బె కొట్టింది. ఇక ఫైనల్ గా రాజ్ తరుణ్ తన తదుపరి సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తున్నాడు. 

గుండెజారి గల్లంతయ్యిందే దర్శకుడు  విజయ్ కుమార్ కొండా బెంగాల్ టైగర్ నిర్మాత కెఎస్.రాధామోహన్ ఈ హీరోతో ఒక ప్రాజెక్ట్ ని సెట్ చేసుకున్న విషయం తెలిసిందే. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఆ సినిమాకు రీసెంట్ గా చిత్ర యూనిట్ "ఒరేయ్ బుజ్జిగా" అనే టైటిల్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. రాజ్ తరుణ్ ఈ సినిమాలో రెండు ఫరెంట్ షేడ్స్ లలో కనిపిస్తాడని టాక్. 

ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ ని వీలైనంత త్వరగా పూర్తి చేసి సినిమా ఫస్ట్ లుక్ ని దసరాకి రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు రాజ్ తరుణ్ మరో రెండు సినిమాలను కూడా ఫినిష్ చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. కుమారి 21F తరువాత రాజ్ తరుణ్ కి వరుసగా అపజయాలు ఎదురవ్వడంతో ఈ సినిమాతోనే ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవ్వాలని అనుకుంటున్నాడు.