Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ లోకి రాజ్ తరుణ్.. అది జరిగే పని కాదట, ఆ ఫోబియా వల్లే వెనక్కి..

రాజ్ తరుణ్ కి బిగ్ బాస్ తెలుగు 8లో పాల్గొనే అవకాశం వచ్చిందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై క్లారిటీ లేదు. కేవలం రూమర్స్ మాత్రం వచ్చాయి. 

Raj Tarun gives clarity on to enter bigg boss telugu season 8 dtr
Author
First Published Aug 28, 2024, 4:04 PM IST | Last Updated Aug 28, 2024, 4:06 PM IST

హీరో రాజ్ తరుణ్, లావణ్య మధ్య వివాదం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతోంది. ఇటీవల రాజ్ తరుణ్ కిపురుషోత్తముడు, తిరగబడరా సామీ చిత్రాలని వరుస ఫ్లాపులు ఎదురయ్యాయి. ఇప్పుడు రాజ్ తరుణ్ ఆశలన్నీ భలే ఉన్నాడే చిత్రంపై ఉన్నాయి. ఈ మూవీ సెప్టెంబర్ 7న రిలీజ్ అవుతుండడంతో మరోసారి రాజ్ తరుణ్ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగాడు. 

మీడియా ప్రతినిధులు మరోసారి రాజ్ తరుణ్ ని లావణ్య గురించి ప్రశ్నించారు. ఇది పక్కనే పడితే గత కొంత కాలంగా రాజ్ తరుణ్ కి బిగ్ బాస్ తెలుగు 8లో పాల్గొనే అవకాశం వచ్చిందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై క్లారిటీ లేదు. కేవలం రూమర్స్ మాత్రం వచ్చాయి. 

భలే ఉన్నాడే  చిత్ర ప్రచార కార్యక్రమాల్లో రాజ్ తరుణ్ కి బిగ్ బాస్ గురించి ప్రశ్న ఎదురైంది. మీరు బిగ్ బాస్ లోకి వెళుతున్నారా అని ప్రశ్నించగా.. లేదు నేను వెళ్లడం లేదు అని రాజ్ తరుణ్ బదులిచ్చారు. తనకి క్లాస్ట్రోఫోబియా ఉందట. అంటే ఇరుకుగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ టైం ఉంటే భయపడిపోవడం. కాబట్టి బిగ్ బాస్ లాంటివి తనకి సెట్ కావని రాజ్ తరుణ్ తెలిపారు. 

వెంటనే భలే ఉన్నాడే చిత్ర దర్శకుడు శివసాయి వర్ధన్ మాట్లాడుతూ.. ఒక రూమ్ లో రాజ్ తరుణ్ గారిని కాసేపు కూర్చో బెట్టడం చాలా కష్టం. కాసేపటికే బయటకి వచ్చేసి పిల్లి తిరిగినట్లు తిరుగుతుంటారు. ఏంటి రాజ్ తరుణ్ బిగ్ బాస్ లోకి వెళుతున్నాడా అని హీరోయిన్ నన్ను అడిగింది.. ఇలాంటి వ్యక్తి బిగ్ బాస్ లోకి వెళతాడా.. ఛాన్సే లేదు అని చెప్పా అంటూ సరదాగా కామెంట్స్ చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios