రంగుల రాట్నం, రాజుగాడు, లవర్  ఇలా వరస పెట్టి ఫ్లాఫ్ సినిమాలు వచ్చి రాజ్ తరుణ్ కెరీర్ ని క్రిందకు లాగేసాయి. దాంతో గత కొన్ని రోజులుగా వార్తల్లో అస్సలు కనిపించలేదు.  కొంత కాలం బ్రేక్ తీసుకున్న రాజ్ తరుణ్ ఎట్టి పరిస్దితుల్లోనూ నెక్స్ట్ సినిమాతో నిలబడాలని చూస్తున్నారు.  అందుకే సరైన ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నారు.

మరో దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రెండు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకుని ఉన్నాడు రాజ్ తరుణ్. ఈ మేరకు రాజ్ తరుణ్ వద్ద అడ్వాన్స్ కూడా ఉంది. ఎగ్రిమెంట్  ప్రకారం దిల్ రాజు బ్యానర్ లో లవర్ సినిమా చేశాడు.  దాంతో  రాజ్ తరుణ్ కు దిల్ రాజు పిలిచి ఓ సినిమా ఇచ్చారు.

అదో టర్కీష్ సినిమా రీమేక్ అని తెలుస్తోంది. దాని రైట్స్ దిల్ రాజు తీసుకున్నారట. ఎమోషనల్ గా నడిచే ప్రేమ కథ అని తెలుస్తోంది. రాజ్ తరుణ్ కి సైతం ఆ సినిమా విపరీతంగా నచ్చడంతో  ఓకే చెప్పేశాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ సీరియస్ గా జరుగుతున్నట్టు టాక్.  దర్శకుడు ఎవరూ అంటే...గతంలో సుధీర్ బాబు హీరోగా ఆడుమగాడ్రా బుజ్జి అనే సినిమా చేశాడు కృష్ణారెడ్డి. చాలా కాలం గ్యాప్ తర్వాత  మళ్లీ ఇన్నేళ్లకు రాజ్ తరుణ్ సినిమాతో దర్శకుడిగా అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. 

త్వరలో మొదలయ్యే ఈ సినిమా నిమిత్తం రాజ్ తరుణ్ కి ఎలాంటి రెమ్యునరేషన్ ఉండదని వినికిడి. లాభాల్లో వాటా ఇచ్చే విధంగా అయితేనే ఇది చేద్దామని అనడంతో రాజ్ తరుణ్ ఓకే చేసాడని అంటున్నారు.