టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్ తన ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. కొన్ని రోజుల క్రితమే తాను త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు రాజ్ తరుణ్ అభిమానులతో చిట్ చాట్ లో తెలిపాడు. తాజాగా ఇంటర్వ్యూలో మరికొన్ని విషయాలు వెల్లడించాడు. 

కొత్త రాజధాని అమరావతికి(విజయవాడ) చెందిన ఓ యువతితో తాను 6 ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. పెద్దల అంగీకారంతో తమ వివాహం 2020లో జరగనున్నట్లు ప్రకటించాడు. తన ప్రేయసి విజయవాడలోని ఓ వ్యాపారవేత్త కుమార్తె. మీడియా అటెన్షన్ వాళ్లకు పెద్దగా ఇష్టం లేదు. అందుకే ఆమె గురించి ఇంతకు మించి వివరాలు చెప్పనని రాజ్ తరుణ్ తెలిపాడు. 

కుటుంబ సభ్యుల నుంచి చాలా రోజుల క్రితమే రాజ్ తరుణ్ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కానీ తన కెరీర్, కమిటై ఉన్న ప్రాజెక్ట్స్ కారణంగా వివాహం ఆలస్యమవుతూ వచ్చింది. మొత్తంగా రాజ్ తరుణ్ 2020లో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాడు. ఉయ్యాలా జంపాల చిత్రంతో హీరోగా మారిన రాజ్ తరుణ్.. కుమారి 21 ఎఫ్, సినిమా చూపిస్త మామ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించాడు. 

నటన పరంగా రాజ్ తరుణ్ ప్రశంసలు దక్కించుకున్నాడు. ప్రస్తుతం రాజ్ తరుణ్ 'ఇద్దరి లోకం ఒకటే' అనే చిత్రంలో నటిస్తున్నాడు. అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే హీరోయిన్. దిల్ రాజు నిర్మాత.