బెయిల్‌ కోసం రాజ్‌కుంద్రా పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ని కోర్ట్ తిరస్కరించింది. ఆయన్ని మరో నాలుగు రోజులపాటు అంటే ఈ నెల 27 వరకు పోలీస్‌ కస్టడీకి అనుమతినిచ్చింది. 

నీలిచిత్రాల కేసులో బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త నాలుగు రోజుల క్రితం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ నెల 23వరకు ఆయన పోలీస్‌ కస్టడీకి ముంబయి కోర్ట్ అనుమతినిచ్చింది. తాజాగా బెయిల్‌ కోసం రాజ్‌కుంద్రా పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ని కోర్ట్ తిరస్కరించింది. ఆయన్ని మరో నాలుగు రోజులపాటు అంటే ఈ నెల 27 వరకు పోలీస్‌ కస్టడీకి అనుమతినిచ్చింది. 

శుక్రవారం ఆయన్ని కోర్ట్ ముందు ప్రవేశ పెట్టగా కోర్ట్ బెయిల్‌ని తిరస్కరించడంతోపాటు పోలీసుల రిక్వెస్ట్ మేరకు జులై 27 వరకు పోలీసుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన్ని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. రాజ్‌ కుంద్రా నుంచి పోర్నోగ్రఫీచిత్రాల కేసులో మరింత లోతుగా విచారించనున్నారు. 

Scroll to load tweet…

ఐపీఎల్‌ టీమ్‌ రాజస్థాన్‌ రాయల్స్ మాజీ కో హోనర్‌, వ్యాపారవేత్త అయిన రాజ్‌కుంద్రా పలువురు మోడల్స్ ని, అమ్మాయిలను వెబ్‌ సిరీస్‌లో ఆఫర్లు ఇస్తామని ఆకర్షించి, వారిచేత బలవంతంగా నీలిచిత్రాలు తీస్తున్నట్టు ఆరోపణలో సోమవారం రాత్రి పోలీసులు రాజ్‌కుంద్రాని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పక్కా ఆధారాలతోనే ఆయన్ని అరెస్ట్ చేసినట్టు ముంబయి పోలీసులు తెలిపారు.