బాలీవుడ్‌ మూవీ `రైడ్ 2`  గురువారం విడుదలైంది.  ప్రీమియర్స్ చూసిన ఆడియెన్స్ రియాక్ట్ అవుతున్నారు. అజయ్, రితేష్ నటన అదుర్స్ అంటున్నారు. ట్విట్టర్ రివ్యూ ఇక్కడ చూడండి!

`రైడ్ 2` ట్విట్టర్ రివ్యూ: అజయ్ దేవగన్ హీరోగా నటించిన `రైడ్ 2` సినిమా నేడు గురువారం థియేటర్లలో విడుదలైంది. అయితే ముందుగానే యూఎస్‌ ప్రీమియర్స్ ప్రదర్శించారు. దర్శకుడు రాజ్ కుమార్ గుప్తా తీసిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అజయ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ అమయ్ పట్నాయక్ గా నటించారు. రితేష్ దేశ్ముఖ్ విలన్ గా కనిపించారు. తమన్నా ఒక డాన్స్ నెంబర్ లో కనిపించింది. రైడ్ 2 చూసిన ప్రేక్షకులు ఏమన్నారో చూద్దాం...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

రైడ్ 2 సూపర్ హిట్ అంటున్నారు ప్రేక్షకులు

`రైడ్ 2` సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఒకరు "రైడ్ 2 రివ్యూ… 4.5 / 5, తప్పకుండా చూడండి" అని రాశారు. ఇంకొకరు "ముందు సినిమా కంటే ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. అజయ్, రితేష్ నటన అదుర్స్. తప్పకుండా చూడాలి" అని రాశారు. ఇంకొకరు "రైడ్ 2 పవర్ఫుల్ మూవీ. 4 కంటే ఎక్కువ రేటింగ్ ఇవ్వచ్చు" అని రాశారు.

Scroll to load tweet…

Scroll to load tweet…

రైడ్ 2 ప్రేక్షకుల అభిప్రాయాలు

రైడ్ 2 సినిమా చూసిన ప్రేక్షకులు "సస్పెన్స్, దేశభక్తి, డ్రామా కలగలిసిన సినిమా" అని అభిప్రాయపడ్డారు. "అజయ్ దేవగన్ ఐఆర్ఎస్ ఆఫీసర్ గా అదుర్స్" అని మరొకరు అన్నారు. "కథ చాలా బాగుంది. ప్రతి సీన్ థ్రిల్లింగ్ గా ఉంది" అని ఇంకొకరు అన్నారు.

100 కోట్ల బడ్జెట్ తో రైడ్ 2

రైడ్ 2 సినిమా 100 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడింది. 2018 లో వచ్చిన రైడ్ కి సీక్వెల్ ఇది. అజయ్ దేవగన్ 75వ రైడ్ వేస్తున్నట్టు కథలో చూపించారు. థ్రిల్లింగ్ గా సాగే ఈ సినిమాలో అజయ్ కి జోడీగా వాణీ కపూర్ నటించింది. రితేష్ దేశ్ముఖ్ విలన్ గా నటించారు. తమన్నా, జాక్వెలిన్ డాన్స్ నెంబర్స్ లో కనిపించారు.