ఆస్కార్ విన్నర్‌గా నిలిచిన `నాటు నాటు` పాటతో పాపులర్ అయ్యారు రాహుల్ సిప్లిగంజ్.. ఇప్పుడు ఆయన పాట పాడితే ఆ సినిమాలు,పాటలు పాపులర్ అవుతున్నాయి. తాజాగా `రుదమాంబపురం` అనే చిత్రంలో పాట పాడారు.
ప్రస్తుతం టాలీవుడ్‌లో రా కంటెంట్ సినిమాలకు ఆదరణ పెరుగుతుంది. వాటిని ఆడియెన్స్ విశేషంగా ఆదరిస్తున్నారు. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నారు. అందుకే అలాంటి రా కంటెంట్ నేపథ్యంలో సినిమాలు తీసేందుకు మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. రియలిస్టిక్ కథలకు, కొంత డ్రామా, కమర్షియల్ అంశాలను జోడించి వెండితెరపై రక్తి కట్టిస్తున్నారు. అదేసమయంలో యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతుంది. థియేటర్లలో సాధ్యం కాని చిత్రాలు ఓటీటీలోనూ విశేషంగా ఆదరణ పొందుతున్నాయి.
అలా కంటెంట్‌ని నమ్ముకుని మత్య్సకారుల జీవితాలపై రూపొందిన చిత్రం `రుద్రమాంబపురం`. `మూలవాసుల కథ` అనే ట్యాగ్ లైన్. ఈ సినిమాకి ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ కథ అందించడం విశేషం. మహేష్ బంటు సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఆజయ్ ఘోష్, శుభోదయం సుబ్బారావు, అర్జున్ రాజేష్, పలాస జనార్దన్, నండూరి రాము, టివి.ఎయిట్ సాయి, శంకర్, డివి.సుబ్బారావు, ప్రమీల, రజిని శ్రీకళ, రత్నశ్రీ, షెహనాజ్, రజిని, సురేఖ, రమణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్‌వీఎల్ ఆర్ట్స్ పతాకంపై నండూరి రాము నిర్మిస్తున్నారు.
ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ మూవీ నుండి `జాతర` సాంగ్ ను ప్రముఖ హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ పాటను ఆస్కార్ విజేత రాహుల్ సిప్లి గంజ్ పాడగా, భాష్య శ్రీ సాహిత్యం అందించారు, అలాగే వెంగి సంగీతం సమకూర్చారు. `రుద్రమాంబపురం` జులై 6నుండి హాట్ స్టార్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ, రాహుల్ సిప్లిగంజ్ పాడిన జాతర పాట అద్భుతంగా ఉంది. రాహుల్‌పాటడంతో పాటకి మరింత అందం వచ్చింది. పల్లెని పరిచయంచేస్తుంది. ఆహ్లాదంగా సాగుతుంది. ఎన్. వి.ఎల్.ఆర్ట్స్ పతాకంపై నిర్మాత నండూరి రాము నిర్మించిన చిత్రం ``రుద్రమాంబపురం`, ములవాసుల కథ`. ఇది మత్స్యకారుల జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాతో యదార్ధ సంఘటనల ఆధారంగా నిర్మించిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా` అని అన్నారు.
ఈ చిత్రంలో తిరుపతి పాత్ర లో అజయ్ గోష్, నటిస్తున్నారు, పెద్దకాపు మల్లోజుల శివయ్య పాత్రలో శుభోదయం సుబ్బారావు నటిస్తున్నారు. వెంగీ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎన్ సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటర్. వెంకటేశ్వరరావు ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
సాంకేతిక వర్గం:
నిర్మాత: నండూరి రాము
దర్శకత్వం: మహేష్ బంటు
బ్యానర్: ఎన్‌వీఎల్ ఆర్ట్స్
కథ: అజయ్ ఘోష్
డిఓపి: ఎన్ సుధాకర్ రెడ్డి
సంగీతం: వెంగీ
ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రావు
ఆర్ట్: వెంకటేశ్వర రావు
ఫైట్స్: దేవరాజు
కో- ప్రొడ్యూసర్: డి నరసింహమూర్తి రాజు
సీఈఓ: అన్నింగి రాజశేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కారెడ్ల బాలాజీ శ్రీను
పీఆర్ఓ: శ్రీధర్