Asianet News TeluguAsianet News Telugu

సమంత ప్లేస్ లో రష్మిక.. డిజాస్టర్ డైరెక్టర్ తో మూవీ, క్రేజీ డీటెయిల్స్

టాలీవుడ్ లో రష్మిక నటిస్తున్న నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్ పుష్ప 2 నే అని చెప్పాలి. అయితే తాజాగా రష్మిక బుట్టలో మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చి పడ్డట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. 

Rahul Ravindran to direct rashmika mandanna soon dtr
Author
First Published Sep 25, 2023, 4:12 PM IST

రష్మిక మందన ప్రస్తుతం పుష్ప 2, యానిమల్ లాంటి క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. టాలీవుడ్ లో రష్మిక జోరు కాస్త తగ్గిందనేది వాస్తవం. శ్రీలీల రాకతో పూజా హెగ్డే, రష్మిక లాంటి హీరోయిన్ల ఆఫర్స్ గల్లంతవుతున్నాయి. టాలీవుడ్ లో రష్మిక నటిస్తున్న నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్ పుష్ప 2 నే అని చెప్పాలి. అయితే తాజాగా రష్మిక బుట్టలో మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చి పడ్డట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. 

అందాల రాక్షసి చిత్రంలో హీరోగా నటించిన రాహుల్ రవీంద్రన్ ఆ తర్వాత పలు చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేశారు. చిలసౌ చిత్రంతో దర్శకుడిగా మారి ప్రశంసలు దక్కించుకున్నారు. రాహుల్ రవీంద్రన్ చివరగా నాగార్జునతో మన్మథుడు 2 చిత్రం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బిగ్ డిజాస్టర్ గా నిలిచింది. 

ఇప్పుడు రాహుల్ రవీంద్రన్ రష్మిక మందనతో ఒక ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రం తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు అరవింద్, బన్నీ వాసు సంయుక్తంగా నిర్మించబోతున్నారట. అయితే రాహుల్ రవీంద్రన్ ముందుగా ఈ కథని సమంత కోసం రాసుకున్నట్లు తెలుస్తోంది. సమంత రాహుల్ రవీంద్రన్ సతీమణి చిన్మయి ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఆ విధంగా సమంతకి రాహుల్ కథ వినిపించాడట. సమంత కూడా ఒకే చెప్పిందట. 

Rahul Ravindran to direct rashmika mandanna soon dtr

కానీ సమంత తన ఆరోగ్య కారణాల రీత్యా ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీనితో రాహుల్ రష్మికకి కథ వినిపించడంతో ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే రానున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios