ప్రస్తుతం టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ ఎంత దారుణంగా తయారైందో తెలిసిందే. ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన 'మన్మథుడు 2' సినిమా కూడా రకుల్ కి కలిసి రాలేదు. ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాలో బోల్డ్ గా నటించింది. ఝాన్సీతో లిప్ లాక్, సిగరెట్ తాగడం వంటి సన్నివేశాల్లో నటించి ఆడియన్స్ కి షాకిచ్చింది రకుల్.

ఈ సినిమా ఎఫెక్ట్ రకుల్ పై బాగా పడింది. టాలీవుడ్లో ఆమె కెరీర్ క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. అయితే తనను నమ్మి ' ‘మన్మథుడు-2’లో నటించిన రకుల్‌కు తనే ఇంకోఅవకాశం ఇచ్చి రకుల్ కెరీర్ చక్కదిద్దాలని రాహుల్ భావిస్తున్నట్లు సమాచారం.

తన తదుపరి చిత్రంలో కూడా రకుల్ నే హీరోయిన్ గా పెట్టనున్నాడని సమాచారం. నిజానికి 'మన్మథుడు 2' సినిమా రాహుల్ సినిమా కాదనే చెప్పాలి. ఎందుకంటే ఓ ఫ్రెంచ్ సినిమాను తెలుగులో తీసి పెట్టమని నాగ్ బలవంతం చేస్తే తీశాడు. సినిమాలో నాగ్ చెప్పినట్లు చేయడంతో తన మార్క్ చూపించలేకపోయాడు.

దీంతో ఈ సినిమా సంగతి పక్కన పెట్టేసి సొంత కథతో సినిమా తీసి మరోసారి తన సత్తా చాటాలని నిర్ణయించుకున్నాడు. నాని హీరోగా ఓ సినిమా పట్టాలెక్కించబోతున్నాడు.  ప్రస్తుతం కథ మీద వర్క్ చేస్తున్నారు. నాని డేట్స్ దొరికితే రకుల్ ని హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నాడు. మరేం జరుగుతుందో చూడాలి!