మన్మధుడు 2 హిట్టయితే డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కెరీర్ మరో యూ టర్న్ తీసుకుంటుందని చెప్పవచ్చు. చి.లౌ.సౌ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న రాహుల్ తొందరగానే స్టార్ హీరోతో వర్క్ చేసే అవకాశాన్ని అందుకున్నాడు. 

నాగార్జున మన్మథుడు 2 సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే తెలిసిపోయింది. అయితే ఈ సినిమా హిట్టయితే వెంటనే రాహుల్ కు మరో అఫర్ దక్కనున్నట్లు సమాచారం. ఇప్పటికే దర్శకుడు ఒక ఎమోషనల్ లవ్ స్టోరీని రెడీ చేసుకున్నాడు. నాగ చైతన్య కూడా రాహుల్ తో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు వేడుకలో తెలిసింది. 

నాగార్జున కూడా రాహులో మీద నమ్మకంతో అన్నపూర్ణ స్టూడియోస్ లో మరో సినిమాను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడు. అది నాగచైతన్యతోనే ఉంటుందని సమాచారం. ఇక మన్మథుడు 2 ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. అగస్టు 9న సినిమా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.