మొదటి సినిమాకే నేషనల్ అవార్డు అందుకున్నాడు దర్శకుడురాహుల్ రవీంద్రన్. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా తొలి సినిమాకే జాతీయ స్థాయిలో అవార్డు తెచ్చుకున్నాడు. ఏ రోజైతే అవార్డు వచ్చిందని తెలిసిందో అదే రోజున రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన రెండో సినిమా 'మన్మథుడు 2' రిలీజైంది.

అయితే ఈ సినిమా అతడి ఆనందానికి అడ్డు తగిలింది. 'చిలసౌ' లాంటి ఓ క్లీన్ సినిమా తీసిన రాహుల్ 'మన్మథుడు 2' సినిమాలో అడల్ట్ కంటెంట్ చూపించాడు. ఈ విషయాన్ని ఎవరూ ఊహించలేకపోయారు. సినిమాలో చాలా బూతులను వాడేశారు. బ్యాంటింగు, తుపాకీ లాంటి పదాలు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎక్కవు.

తొలి సినిమాకి క్లీజ్ ఇమేజ్ తెచ్చుకున్న రాహుల్ కి ఈ సినిమాతో ఆ ఇమేజ్ కాస్త పోయింది. 'చిలసౌ' సినిమాలో రైటర్ గా, దర్శకుడిగా తన సత్తా చాటాడు రాహుల్. కానీ 'మన్మథుడు 2'లో ఆ రెండూ మిస్ అయ్యాయి. ఈ సినిమా విషయంలో రాహుల్ ని తప్పుదోవ పట్టించారని.. అందుకే బూతు కామెడీ వైపు అతడు మొగ్గుచూపాడని ఇన్సైడ్ టాక్.

నాగార్జున కూడా రాహుల్ కి కొన్ని సలహాలు ఇచ్చారని అవి ఫాలో అవ్వడం వలన ఇలాంటి ప్రోడక్ట్ వచ్చిందని అంటున్నారు. ఏదేమైనా.. రాహుల్ పై మాత్రం బూతు ఇమేజ్ పడింది. అది పోవాలంటే అతడు వెంటనే మరో క్లీన్ ఫిలిం తీయాల్సివుంది. మరి 'మన్మథుడు 2' తరువాత కూడా తనకు పిలిచి ఎవరైనా ఛాన్స్ ఇస్తారేమో చూడాలి!