ఆహాలో వ‌రుస‌గా మూడు వెబ్ సిరీస్‌లుచేయాల‌న్న‌ది మారుతి ఒప్పందం. త్రీ రోజెస్ తో ఒక‌టి అయిపోయింది. ఇప్పుడు `ఇంటింటి రామాయ‌ణం`. త్వ‌ర‌లోనే మ‌రో వెబ్ సిరీస్‌కీ మారుతి శ్రీ‌కారం చుట్ట‌బోతున్నారు. 


డైరక్టర్ గా అటు సినిమా, ఇటు ఓటీటీ.. ఈ రెండింటిపైనా దృష్టి పెడుతున్నారు మారుతి. గతంలో `త్రీ రోజెస్‌` పేరుతో మారుతి నుంచి ఓ వెబ్ సిరీస్ వచ్చింది. ఇప్పుడు మ‌రో వెబ్ సిరీస్‌కి రంగం సిద్ధ‌మైంది. `ఇంటింటి రామాయ‌ణం` పేరుతో ఓ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు మారుతి. ఈసారి ఆహా కోసం. మారుతి ఈ వెబ్ సిరీస్ కి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. గీతా ఆర్ట్స్ తో ఉన్న అనుబంధం కారణంగా మారుతి కూడా 'ఆహా'కి మంచి కంటెంట్ ఇస్తూ వెళుతున్నాడు. సినిమాకి .. సినిమాకి మధ్య గ్యాపులో ఆయన ఓటీటీకి కంటెంట్ ఇచ్చే పనిలో బిజీగా ఉంటున్నాడు.

 'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి మారుతి మరో కంటెంట్ తీసుకుని వస్తున్నాడు. ఆ వెబ్ సిరీస్ పేరే 'ఇంటింటి రామాయణం'. ఈ కథ తెలంగాణ ప్రాంతంలోని ఒక మారుమూల గ్రామంలో నడుస్తుంది. ఇందులో ప్రధానమైన పాత్రను రాహుల్ రామకృష్ణ పోషించాడు. అతని కుటుంబం ఎలాంటి సమస్యల్లో పడుతుంది? .. వాటి బారి నుంచి బయటపడటానికి ఆయన ఏం చేస్తాడు? అనేదే కథ.ఈ వెబ్ సిరీస్ లో రాహుల్ రామకృష్ణ జోడీగా 'నవ్య' కనిపించనుంది. 'నా పేరు మీనాక్షి' .. 'ఆమె కథ' వంటి టీవీ సీరియల్స్ ద్వారా ఆమె పాప్యులర్. 

ఇక కీలకమైన పాత్రలో 'గంగవ్వ' కనిపించనుంది. తెలంగాణ యాస విషయంలో ఆమె ప్రత్యేకతను గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. కల్యాణి మాలిక్ ఈ వెబ్ సిరీస్ కి సంగీతాన్ని అందించాడు. సితార నాగవంశీ సమర్పిస్తున్న ఈ వెబ్ సిరీస్ ను త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు. ఈ సినిమా కు మారుతి షాడో డైరెక్టర్ అనే ప్రచారం కూడా జరుగుతోంది.

మరో ప్రక్క ప్రభాస్ వంటి పాన్ ఇండియా సూపర్‌ స్టార్ తో సినిమా చేస్తూ ఇలా చిన్న సినిమా ల నిర్మించడం.దర్శకత్వం వహించడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు ప్రభాస్ అభిమాను లు అభిప్రాయం చేస్తున్నారు.ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్‌ లో పాల్గొంటున్నాడు.అతి త్వరలోనే మళ్లీ మారుతి కి డేట్లు ఇచ్చాడనే వార్తలు వస్తున్నాయి.