Asianet News TeluguAsianet News Telugu

Brahmamudi: రివర్స్ డ్రామా ప్లే చేసిన రాహుల్.. కళ్యాణ్ ని చూసి కంగారు పడుతున్న కనకం!

Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీ ఇస్తూ మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. తమ ఇష్టా ఇష్టాలతో ప్రమేయం లేకుండా భార్యాభర్తలైన ఒక జంట కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మార్చ్ 21 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

Rahul plans to seek revenge against Raj's family in todays Brahmamudi serial gnr
Author
First Published Mar 21, 2023, 12:57 PM IST

ఎపిసోడ్ ప్రారంభంలో ఈ ఇంట్లో చాలామంది నీకు సపోర్ట్ ఇస్తున్నారు మీ తాతయ్య నిన్ను చూసి చాలా సంతోషిస్తున్నారు. మేమిద్దరమే నీకు ఎప్పుడు అండగానే ఉంటాము. మీ తాతయ్య నిన్ను పదిమంది పెద్దల సమక్షంలో పరిచయం చేయాలి అనుకుంటున్నారు అప్పుడు నీకు వేరే మ్యారేజ్ సర్టిఫికెట్ ఏమీ అక్కర్లేదు అంటుంది చిట్టి. ఈ నక్లెస్ నాకు కాలనాగు లాగా అనిపిస్తుంది అంటుంది కావ్య.

నెక్లెస్ విసిరేసినప్పుడు ఎక్కడో పడాలి కానీ సరిగ్గా నీ మెడలోనే పడింది అది దైవ లీల. అలాగే ఇంటి ఆచారం ప్రకారం భర్త మొదటి ముద్ద తినిపించాలి రాజ్ నీకు తినిపించాడు. ఇవన్నీ దైవ లిఖితం. అసలు ఈ పెళ్లి మీ అమ్మ అబద్ధాలు ఆడటం వల్లనో స్వప్న వెళ్ళిపోవటం వల్లనో జరగలేదు కేవలం దేవుని అనుగ్రహం వల్ల జరిగింది అంటుంది చిట్టి. మీ మాటలు వింటుంటే పవిత్ర గ్రంథం చదివినట్లుగా ఉంది అంటుంది కావ్య.

ఇది నేను నేర్చుకున్న మాటలు కావు వయసు వల్ల అనుభవంతో నేర్చుకున్న మాటలు ఆ అనుభవంతోనే చెప్తున్నాను. ఆ దేవుడు మీ జంట మధ్య ఉన్న అడ్డుగోడల్ని కూల్చేస్తాడు అని చెప్తుంది చిట్టి. ఆ మాటలకి కరిగిపోయినా కావ్య ఫంక్షన్ లోకి రావడానికి ఒప్పుకుంటుంది. మరోవైపు ఇంట్లో జరిగినదంతా రాహుల్ కి చెప్తుంది రేఖ. రావడం రావటమే మమ్మీని విరిగింది అంటూ కావ్య మీద కోపగించుకుంటాడు రాహుల్.

అయినా వాళ్ళ ఫ్యామిలీ అంతా ఫ్రాడ్ అనుకుంటా అన్నయ్య స్వప్న కూడా అలా చేసిందంటే తనకి ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉండి ఉంటారు అంటుంది రేఖ. తను అంతా తెలివైనది కాదేమో అయినా రాజ్ కూడా పెద్ద బోరింగ్ పర్సన్ కదా అంటాడు రాహుల్. స్వప్నని మంచి క్యారెక్టర్ అనుకోకు ఎవడో ఇంతకన్నా రిచ్ ఫెలోని అని నమ్మించి ఉంటాడు వాడితో జంప్ అయిపోయి ఉంటుంది అంటుంది రేఖ.

అయినా వాళ్ల సంగతి మనకెందుకు మమ్మీ సంగతి ఆలోచిద్దాం అంటాడు రాహుల్. నెలకి పదివేలు కూడా సంపాదించని అమ్మాయి ఇంటికి రాగానే మమ్మీ వాల్యూ పడిపోయిందా.. ఇప్పుడు నాకు ఈ ఫ్యామిలీలో ఆ ఫ్యామిలీలో అందరూ శత్రువులే అంటాడు రాహుల్. నీకే కాదు నాకు, మమ్మీకి కూడా అందరూ శత్రువులే ఎక్కడ దొరికితే అక్కడ దెబ్బతీయాలి అంటుంది రేఖ.

మరోవైపు రాజ్ దగ్గరికి వచ్చి మీ పెళ్లిలో లేనందుకు కోపంగా ఉన్నావా అంటాడు రాహుల్. డల్ గా ఉన్న రాజ్ ని చూసి నువ్వు రెండు విధాలుగా నష్టపోయావు కావాలనుకున్న అమ్మాయిని ఇబ్బంది లేక పోయావు నీ శత్రువు అనుకున్న అమ్మాయికి తాళి కట్టావు అంటాడు రాహుల్. మనసులో మాత్రం మీ ఇద్దరినీ మోసం చేయాలనుకుని నేనే మోసపోయాను కాకపోతే తృప్తి ఏంటంటే నాతో పాటు నువ్వు కూడా మోసపోయావు అది చాలు నాకు అనుకుంటాడు రాహుల్.

మోసం చేసే వాళ్ళు ప్రపంచం నిండా చాలామంది ఉన్నారు కానీ అంత సులువుగా మోసపోవడం నాదే తప్పు అంటాడు రాజ్. నువ్వు కళావతిని చేసుకోవటానికి మా అమ్మే కారణమంట కదా ఆ విషయం తెలిసి చాలా గట్టిగా ఫీల్ అవుతున్నాను నీ మొహం చూడటానికి కూడా ఇబ్బందిగా ఉంది అంటాడు రాహుల్. రుద్రాణి తన సొంత అత్త కాదనే విషయం రాహుల్ కి తెలియకూడదు అనుకుంటాడు రాజ్.

నువ్వు పర్మిషన్ ఇస్తే నేను రేఖని మమ్మీని తీసుకొని దూరంగా వెళ్లిపోతాను అంటాడు రాహుల్. ఆ మాత్రానికే దూరం వెళ్లిపోవడం ఎందుకు మనం కలిసి పెరిగాము ఎప్పటికీ ఉమ్మడి కుటుంబంలో కలిసే ఉందాము అంటాడు రాజ్. నువ్వు అలా అంటావ్ అని తెలుసు అందుకే రివర్స్లో డ్రామా ప్లే చేశాను అనుకుంటాడు రాహుల్. మరోవైపు రిసెప్షన్ కి బయలుదేరుతున్న కనకాన్ని ఆపి ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు కృష్ణమూర్తి.

ఈరోజు కావ్య రిసెప్షన్ అంటే నిన్ను పిలిచారా, నిన్ను క్షమించేసారా అంటాడు  కృష్ణమూర్తి. కావ్య అక్కడ ప్రశాంతంగా బ్రతకడం నీకు ఇష్టం లేదా వాళ్ళందరూ అక్కడ నిన్ను చూశారంటే మనుషుల్ని పెట్టించేస్తారు అంటాడు కృష్ణమూర్తి. నన్ను గెంటేది ఎవరు? వద్దంటే వెనక్కి వచ్చేస్తాను అంటుంది కనకం. ఒకసారి వెళ్లి అవమాన పడింది చాలదా అంటాడు కృష్ణమూర్తి. అలా అని ఎవరు అన్నారు అంటుంది కనకం.

నీతో కాపురం చేసిన ఇన్నాళ్లలో నీకు కళ్ళల్లో నలత పడిందో మనసులో నలత పడిందో తెలుసుకోనంత వెర్రి వాడిని కాదు అంటాడు కృష్ణమూర్తి. ఆ మాటలకి తలదించుకుంటుంది కనకం. ఇంత జరిగిన మళ్ళీ ఎట్లా పోతానంటున్నావ్ అంటూ అప్పు కూడా మందలిస్తుంది. ఇప్పుడే గొడవలు జరుగుతున్నాయి కదా కొన్నాళ్లు పోతే పరిస్థితి సర్దుకుంటుంది. అప్పుడు రాకపోకలు సాగించవచ్చు.

ఇప్పుడు వెళ్తే అవమానం జరగవచ్చు అంటుంది ఆమె తోటి కోడలు. కావ్య ఉన్నన్నాళ్ళు తన విలువ తెలియలేదు తను ఉన్నన్నాళ్ళు నేను నా పెద్ద కూతురు దాన్ని ఎలా దోచుకున్నాము గుర్తుంచి మనసంతా బాధగా అయిపోతుంది అంటుంది కనకం. నిజమే కానీ నీ బాధ నీ కూతురు కాపురానికి సమస్య కాకూడదు అంటాడు కృష్ణమూర్తి. అయినా నీకు సిగ్గు శరం లేదా అమ్మా చీ కొట్టిన దగ్గరికి ఏం మొహం పెట్టుకొని వెళ్తావు అంటూ తల్లికి ఛీవాట్లు పెడుతుంది అప్పు.

మరోవైపు రిసెప్షన్ కు మోడ్రన్ గెటప్ లో ఎంట్రీ ఇస్తుంది  కామాక్షి. అక్కడ ఉన్న పని వాడిని పెళ్లికూతురు పెళ్లి కొడుకు ఎక్కడ అని అడుగుతుంది. కామాక్షిని గుర్తుపట్టని పనివాడు వస్తున్నారు అని చెప్తాడు. వీడు గుర్తుపట్టలేదు అంటే ఇంకెవరు నన్ను గుర్తుపట్టరు అనుకుంటూ దర్జాగా లోపలికి వెళ్ళిపోతుంది కామాక్షి. లోపలికి వచ్చిన కామాక్షి నన్ను ఈ టైం కి రమ్మని చెప్పి తన ఇంకా రాలేదేంటి అని కనకాన్ని వెతుకుతుంది కామాక్షి. అక్కడికి మ్యూజిషియన్  వేషంలో వస్తుంది కనకం.

అక్క, చెల్లి ఇద్దరు ఒకరిని ఒకరు గుర్తు పట్టి ఆనందంతో హగ్ చేసుకుంటారు. ఇంతలో పిల్లలందరూ వచ్చి బఫున్ అనుకొని కనకాన్ని లాక్కుపోతారు. మరోవైపు ఇందాక కామాక్షిని రిసీవ్ చేసుకున్న పనివాడు కామాక్షికి లైన్ వేస్తూ ఉంటాడు. ఆమె ఎంత చిరాకు పడుతున్న నిన్ను వదలను ఆంగ్ల దొరసాని అనుకుంటూ ఆమె వెనకాలే తిరుగుతూ ఉంటాడు.

మరోవైపు రాహుల్ రిసెప్షన్ కి వెళ్తున్న విషయం ఎందుకు చెప్పలేదు ఎందుకు నా దగ్గర దాచాడు. రాజ్ కావ్యని ఎలా పెళ్లి చేసుకున్నాడు. అసలు అక్కడ ఏం జరుగుతుంది తెలియాలంటే నేను అక్కడికి వెళ్లాలి. ఏం మొహం పెట్టుకుని అలా వెళ్ళగలను. నీ మొహంతో వెళ్తే అందరూ నన్ను నానా మాటలు అంటారు అయినా వెళ్లి తీరాలి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటుంది స్వప్న.

మరోవైపు కామాక్షి కనకం మాట్లాడుకోవడం కళ్యాణ్ చూస్తాడు. ఆ కవి మనల్ని గుర్తుపట్టినట్లు ఉన్నాడు మన దగ్గరకే వస్తున్నాడు అని కంగారుపడుతుంది కనకం. తరువాయి భాగంలో రాజ్ కావ్యని జంటగా చూసి ఆనందంతో కన్నీరు పెట్టుకుంటుంది కనుక నేను అన్యాయం చేసిన ఆ దేవుడు న్యాయం చేశాడు అని కామాక్షికి చెప్తుంది. అక్కడే ఉన్న అపర్ణని నమస్తే వదినగారు అంటూ పలకరిస్తుంది. తర్వాత ఆమెను చూసి కంగారుగా పరిగెడుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios