కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 రసవత్తరంగా సాగుతోంది. నాగార్జున తన బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం కుటుంబ సభ్యులతో కలసి వెకేషన్ వెళ్ళాడు. దీనితో అందాల రమ్యకృష్ణ టెంపరరీ హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చి హౌస్ మేట్స్ తో పాటు ఇంటి సభ్యులని ఆశ్చర్యంలో ముంచెత్తింది. 

నాగ్ రాలేదని నిరాశపడ్డ అభిమానులున్నప్పటికీ ఆ ప్లేస్ లోకి రమ్యకృష్ణ రావడంతో అందరిలో జోష్ పెరిగింది. బిగ్ బాస్ కు కొత్త గ్లామర్ జత కలసినట్లు అయింది. ముఖంలో చిరునవ్వుతూ రమ్యకృష్ణ ఎలాంటి తడబాటు లేకుండా బిగ్ బాస్ వేదికపై మెప్పించింది. ఆదివారం రోజు కూడా రమ్యకృష్ణ బిగ్ బాస్ లో మెరవబోతోంది. 

ఆదివారం ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు. నేడు జరగబోయే ఎపిసోడ్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉండబోతున్నట్లు అర్థం అవుతోంది. రమ్య కృష్ణ హౌస్ మేట్స్ కు సీన్ చేయండి అనే చిన్న గేమ్ పెట్టింది. ఈ గేమ్ లో భాగంగా పునర్నవి, రాహుల్ మధ్య సంభాషణ ఆసక్తికరంగా ఉంది. 

అనవసరంగా నా వెనుక పడి చాయ్ ఇవ్వమని, తల మసాజ్ చేయమని ఎందుకు అడుగుతున్నావు.. నా చేత ఎందుకు ఈ పనులు చేయించుకుంటున్నావు అని పునర్నవి రాహుల్ ని నిలదీసింది. నువ్వు నన్ను ప్రేమించట్లేదా అని అడిగింది. 

ఇక వితిక, వరుణ్ సందేశ్ జంట మధ్య కూడా సరదా గొడవ జరిగింది. బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత ముద్దులు ముచ్చట్లు ఏమీ లేవు అని వితిక అనగా.. ఇక్కడ అవన్నీ చేస్తే బాగోదు అని వరుణ్ అంటాడు. బాబా భాస్కర్, శ్రీముఖి మధ్య జరిగే సంభాషణ కూడా ఆసక్తికరంగా ఉండబోతోంది.