మీటూ ఎఫెక్ట్ కాస్త స్లో అయ్యిందనే టాక్ వచ్చే లోపే ఎవరో ఒకరు షాకింగ్ కామెంట్స్ చేస్తూ మళ్ళీ వైరల్ అయ్యేలా చేస్తున్నారు. కొంత మంది సెలబ్రెటీలపై లైంగిక ఆరోపణలు చేసిన రాధికా ఆప్టే ఈ సారి పేరు చెప్పకుండా మరో దర్శకుడు నన్ను వేధించాడంటూ సంచలనం సృష్టించింది. 

రాధికా మాట్లాడుతూ.. సౌత్ లో ఒక దర్శకుడు కొన్నేళ్ల క్రితం హోటల్ కి పిలిచాడు. ఆ హోటల్ చాలా నీచంగా ఉంది. అయినా కూడా ఆడిషన్స్ చెప్పడంతో వెళ్లాను. కానీ అక్కడ ఊహించని చేదు అనుభవాలను ఎదుర్కొన్నా. సినిమాకు అవసరం లేని స్టెప్పులు వేయించారు. చిన్న చిన్న దుస్తులు వేసుకోమన్నారు. 

అవి చాలా అసభ్యకరంగా ఉన్నాయి. చుట్టూ కాస్ట్యూమర్స్ పేరుతో కొంత మంది మగవాళ్ళు చేరారు. చిన్న జాకెట్ ఇచ్చి వేసుకోమన్నారు. ఫొటో షూట్ కూడా చేశారు. తరువాత ఆ ఫొటోలో ఎలా మాయమయ్యాయో తెలియదు. విక్రమ్ సినిమా భారీ బడ్జెట్ ఫిల్మ్ అని ఏదేదో చెప్పారు. అతను ప్రవర్తించిన తీరుకు చాలా కోపం వచ్చింది. చెప్పలేనంత అసభ్యంగా ప్రవర్తించాడు అని రాధిక వివరించింది.