Padamati Sandhyaragam: జీ తెలుగులో ప్రసారమవుతున్న పడమటి సంధ్యారాగం సీరియల్ మంచి కంటెంట్ తో మంచి టిఆర్పి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. సాంప్రదాయానికి ఆధునికతకి మధ్య నలిగిపోతున్న ఒక కుటుంబ కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 20 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

 ఎపిసోడ్ ప్రారంభంలో వంట పని చేయటానికి సిద్ధపడుతుంది రామలక్ష్మి. కోపంతో కాయగూరలు కట్ చేస్తూ ఉంటుంది. ఈ పని నీకెందుకు వెళ్ళు అంటుంది జానకి. చేయనీయమ్మ రేపటి రోజున అత్తారింటికి వెళ్ళాక నేను చేయవలసింది ఇదే కదా అక్కడ అన్ని పనులు చేసి మంచి పేరు సంపాదించుకుంటాను అంటుంది రామలక్ష్మి.

 ఆపు రామలక్ష్మి.. ఇది పనివాళ్ళు చేసే పని అంటుంది పద్మ. పని వాళ్ళు చదువు లేక పని చేస్తున్నారు ఇప్పుడు నాకు కూడా చదువు లేదు కదా నేను ఈ పని చేస్తే తప్పేంటి అంటూ కోపంగా కూరలు కోస్తూ అంటుంది రామలక్ష్మి. ఈ మాటలు అన్ని రఘురాం వింటూ బాధపడతాడు. మీ నాన్నతో మాట్లాడుతానని చెప్పాను కదా చదువుకుందువు గానివి లే అని సర్ది చెప్తుంది జానకి.

 కోపంగా కూరలు కోస్తున్న రామలక్ష్మి వేలు తెగుతుంది. జానకి కంగారుపడుతూ రామలక్ష్మి ని అక్కడి నుంచి పక్కకు తీసుకువెళ్లి మందు రాస్తుంది. చెప్పాను కదా అంతవరకు ఓపిక పట్టొచ్చు కదా ఎందుకంత ఆవేశం అసలే పొద్దుట నుంచి ఏమీ తినలేదు అంటూ కూతుర్ని మందలిస్తుంది జానకి. సీన్ కట్ చేస్తే కూతురు బాధని చూడలేక ఒంటరిగా ఏడుస్తుంది జానకి.

 కూతురు తప్పు చేస్తే తల్లికి మిగిలేది బాదే అంటుంది పద్మ. కరెక్ట్ గా చెప్పావమ్మా పిల్లలు తప్పు చేస్తే ఆ బాధ తల్లిదండ్రులకే అంటాడు అప్పుడే వచ్చిన రఘురాం. నువ్వేంటి అన్నయ్య ఇలా వచ్చావు? ఏమైనా కావాలా అని అడుగుతుంది పద్మ. బిడ్డ ఆకలి తీర్చవలసిన బాధ్యత తల్లిదండ్రులదే కదా అన్నం పెట్టి ఇవ్వు అంటాడు రఘురాం. భోజనం ప్లేట్ లో పెట్టి ఇస్తుంది పద్మ.

దానిని తీసుకొని రామలక్ష్మి గదికి వెళ్తాడు రఘురాం. అప్పటికే ఏడుస్తూ కూర్చుంటుంది రామలక్ష్మి. భోజనం చేద్దాం గానివి రా అంటాడు రఘురాం. ఆకలిగా లేదు అంటుంది రామలక్ష్మి. నిజమే కోపం ఆకలిని మింగేస్తుంది కానీ కోపానికి తను చేసిన తప్పు తెలియదు కదా అంటాడు రఘురాం. తండ్రి చేయి పట్టుకొని నేను చదువుకుంటాను నాన్న అని బ్రతిమాలుతుంది రామలక్ష్మి.

 కూతుర్ని పక్కన కూర్చోబెట్టుకుని  భోజనం తినిపిస్తూ కూతురు కూలి పని చేస్తే చూడాలని ఏ తండ్రి అనుకోడు. అందుకే మీ కాబోయే అత్తమామలని ఒప్పించి మరీ నిన్ను కాలేజీకి పంపించాను నువ్వేం చేసావు. చెప్పకుండా హాకీ ఆడటం తప్పే కదా అంటూ బుజ్జగించినట్లుగా చెప్తాడు బుజ్జగించినట్లుగా చెప్తాడు రఘురామ్. ఇకమీదట  అలా జరగకుండా చూసుకుంటాను అంటుంది రామలక్ష్మి.

అయినా నాకు ఇష్టం లేదు..ఇంటి పెద్దగా ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనకడుగు వేయకూడదు అంటాడు రఘురాం. ఆ మాటలకి ఒక్కసారిగా  పొలమారుతుంది రామలక్ష్మి. ఇప్పటికిప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది నా బాధ ఎవరితో చెప్పుకోవటం అర్థం కాలేదు అంటూ ఏడుస్తుంది. తన బాధ చూస్తే మాకు కూడా చాలా బాధగా ఉంది అంటారు పార్వతి, పద్మ.

హాకీ జోలికి వెళ్ళను అంటే చదువుకోవడానికి పంపిస్తాను అంటాడు రఘురాం. అలాగే అంటూ ఆనందపడుతుంది రామలక్ష్మి. వెళ్లి కాలేజీకి రెడీ అవ్వు అని తండ్రి చెప్పటంతో ఆనందంగా లోపలికి పరిగెడుతుంది. రెడీ అయ్యి బయటకు వచ్చి బయటికి వెళ్లే సమయానికి రామలక్ష్మి కాబోయే భర్త వస్తాడు. ఏంటి ఈ సమయంలో ఇలా వచ్చారు అంటాడు రఘురాం.

అమ్మ హల్వా చేసింది రామలక్ష్మి కి ఇష్టమని ఇచ్చి రమ్మంది అంటూ రామలక్ష్మి చేతిలో బాక్స్ పెడతాడు వచ్చిన వ్యక్తి. తర్వాత తింటాను  అని చెప్పి తల్లి చేతిలో బాక్స్ పెట్టేస్తుంది రామలక్ష్మి. ఎక్కడికో బయలుదేరుతున్నట్లుగా ఉంది అంటాడు  రామలక్ష్మి కాబోయే భర్త. కాలేజీకి బయలుదేరుతుంది అంటాడు రఘురాం. ఏదో గుర్తొచ్చిన వాడిలాగా నా సెల్ బండిలో మర్చిపోయాను తీసుకువస్తాను అంటూ బయటికి వెళ్లి రామలక్ష్మి సైకిల్ కి ఉన్న గాలిని తీసేస్తాడు.

ఇంతలో రామలక్ష్మి బయటికి వచ్చి సైకిల్ ఎక్కుదామని చూసేసరికి గాలి ఉండదు. టైర్ పంచర్ అయింది అమ్మ ఇప్పుడు కాలేజీకి ఎలా వెళ్ళటం అని కంగారు పడుతుంది. నేను డ్రాప్ చేస్తాను అంటాడు ఆ వ్యక్తి. వద్దు బాబు తను ఆటోలో వెళ్ళిపోతుంది అంటుంది జానకి. రామలక్ష్మి కూడా వెళ్లడానికి ఇష్టపడదు. పర్వాలేదు అండి జాగ్రత్తగా నేను తీసుకువెళ్తాను.

 కావాలంటే మావయ్య గారితో మాట్లాడతాను అంటాడు అతను. మళ్లీ నాన్నగారికి తెలిసిందంటే కోప్పడతారు అంటూ రామలక్ష్మి ని బలవంతంగా అతని బండి ఎక్కిస్తుంది జానకి. భయం భయంగా కూర్చుంటుంది రామలక్ష్మి. బండిమీద వెళ్తూ ఏదైనా మాట్లాడు అని రామలక్ష్మి అడుగుతాడు ఆ వ్యక్తి. నన్ను దించేయండి నేను ఆటోలో కాలేజీకి వెళ్లి పోతాను అంటుంది  రామలక్ష్మి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.