Asianet News TeluguAsianet News Telugu

కుర్ర హీరోయిన్ కి రాఘవేంద్రరావు లవ్ లెటర్!

'నన్ను దోచుకుందువటే' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన హీరోయిన్ నభా నటేష్ కి ఆ సినిమాతో మంచి పేరే దక్కింది. సినిమా సరిగ్గా ఆడకపోయినా.. నభాకి మాత్రం టాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే రెండు, మూడు సినిమాలలో నటించే అవకాశం దక్కించుకుంది. 

raghavendrarao love letter to young heroine
Author
Hyderabad, First Published Nov 5, 2018, 12:35 PM IST

'నన్ను దోచుకుందువటే' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన హీరోయిన్ నభా నటేష్ కి ఆ సినిమాతో మంచి పేరే దక్కింది. సినిమా సరిగ్గా ఆడకపోయినా.. నభాకి మాత్రం టాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే రెండు, మూడు సినిమాలలో నటించే అవకాశం దక్కించుకుంది.

అయితే నన్ను దోచుకుందువటే సినిమా విడుదలైన తరువాత దర్శకుడు రాఘవేంద్రరావు టీమ్ మొత్తాన్ని ఇంటికి పిలిపించి అభినందించారట. ఈ విషయాన్ని గుర్తు చేసుకున్న హీరోయిన్ నభా.. ''నాకు సినిమాలంటే బాగా ఇష్టం. 80-90 వ దశకాల్లో వచ్చిన తెలుగు సినిమాలు చాలానే చూశాను. ముఖ్యంగా రాఘవేంద్రరావు గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం.

హీరోయిన్లను ఆయన చాలా అందంగా చూపిస్తారు. 'నన్ను దోచుకుందువటే' సినిమా రిలీజ్ తరువాత ఆయన టీమ్ మొత్తాన్ని ఇంటికి పిలిచారు. నా గురించి అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఇంతబాగా ఎలా నటించావు..? మీ కుటుంబంలో ఎవరైనా యాక్టర్స్ ఉన్నారా అని అడిగారు. అలా ఏమీ లేదని, మా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి వచ్చిన మొదటి అమ్మాయిని నేనేనని చెబితే మరింతగా అభినందించారు.

నాకు ప్రేక్షకుల నుండి ప్రేమలేఖలేవీ రాలేదు. అలాంటివి వస్తాయేమోనని చూసి నిరాశ చెందాను. కానీ రాఘవేంద్రరావు గారి అభినందననే ఓ ప్రేమ లేఖగా భావించా'' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె నటించిన 'అదుగో' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది!

Follow Us:
Download App:
  • android
  • ios