దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు నిర్మాతగా మారబోతున్నారు. ఓ ప్రేమ కథాచిత్రని నిర్మించేందుకు రాఘవేంద్ర రావు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ గురించి వస్తున్న వార్తలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని ముగ్గురు దర్శకులు తెరకెక్కించబోతున్నారట. అందులో ఒకరు క్రిష్. 

ఈ చిత్రంలో హీరోగా యువ నటుడు నాగ శౌర్య నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నాగ శౌర్య షూటింగ్ లో గాయపడగా రాఘవేంద్ర రావు అతడి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఇక ఈ చిత్రంలో మూడు ప్రేమ కథలు ఉంటాయట. ఒక్కో ప్రేమ కథని ఒక్కో దర్శకుడు తెరక్కిస్తాడు. 

ఈ చిత్రం కోసం ఒక దర్శకుడిగా క్రిష్ పేరు వినిపిస్తోంది. మిగిలిన ఇద్దరు దర్శకులు ఎవరో తెలియాల్సి ఉంది. నాగ శౌర్య గాయం నుంచి కోలుకోగానే షూటింగ్ ప్రారంభించాలని రాఘవేంద్ర రావు భావిస్తున్నారు. కథకు అనుగుణంగా ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారు.