మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ దక్కించుకుంది.సామాన్య ప్రజల నుండి సెలబ్రిటీల వరకు ప్రతీ ఒక్కరూ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

రాజమౌళితో సహా చాలా మంది సెలబ్రిటీలు మొదటిరోజే ఈ సినిమాను చూసి సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో తనకు తెలిసిన చిరంజీవిగాకాకుండా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగానే కనిపించాడని అన్నారు.

మెగాస్టార్ అధ్బుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని.. సైరా టీమ్ కి కృతజ్ఞతలు తెలిపారు. 'సైరా' బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని రాఘవేంద్రరావు కితాబిచ్చారు. దర్శకుడు సురేందర్ రెడ్డి కష్టం సినిమాలో కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోందని.. ప్రీక్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాల్లో తమన్నా అధ్బుతంగా నటించిందని అన్నారు. నిర్మాతగా వ్యవహరించిన రామ్ చరణ్ ఈ చారిత్రాత్మక చిత్రంతో తండ్రికి సరైన గిఫ్ట్ ఇచ్చారని రాఘవేంద్రరావు అన్నారు.