యువ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన తాజా చిత్రం 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'. ఈ చిత్రానికి స్వరూప్ దర్శకుడు. గత వారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి షో నుంచే మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్ర బాక్సాఫీస్ రన్ విజయవంతంగా కొనసాగుతోంది. నవీన్ సరసన శృతి శర్మ హీరోయిన్ గా నటించింది. 

ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకునే దిశగా పయనిస్తోంది. ఈ చిత్రంలో నవీన్ నెల్లూరు యాసలో డైలాగ్స్ బాగా చెప్పాడు. తాజాగా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్ర యూనిట్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుని కలిసింది. 

అద్భుతమైన సినిమా తెరక్కించారని రాఘవేంద్ర రావు చిత్ర యూనిట్ ని ప్రశంసించారు. చిత్రం విజయం సాధించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. స్వధర్మ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.