పవన్ కళ్యాణ్ 27 ఏళ్ల సినీ కెరీర్ కూడా పూర్తి చేసుకున్నారు. దీనితో సినీ ప్రముఖలు పవన్ కళ్యాణ్ కి విషెస్ తెలుపుతున్నారు. తాజాగా దిగ్గజ దర్శకులు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పవన్ ని విష్ చేస్తూ వీడియో సందేశం ఇచ్చారు. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వైపు ప్రస్తుతం సినీ రాజకీయ లోకం ఉత్కంఠగా చూస్తోంది. రాబోవు రోజుల్లో పవన్ కళ్యాణ్ కేంద్రంగా అంత్యంత కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. పవన్ స్థాపించిన జనసేన పార్టీ రాజకీయంగా ఇంకా ప్రభావం చూపలేదు. మరో ఏడాదిలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో పవన్ నిర్ణయాలు ఎలా ఉంటాయనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా సినిమాల పరంగా కూడా పవన్ ఫుల్ బిజీగా ఉన్నారు. 

పవన్ కళ్యాణ్ 27 ఏళ్ల సినీ కెరీర్ కూడా పూర్తి చేసుకున్నారు. దీనితో సినీ ప్రముఖలు పవన్ కళ్యాణ్ కి విషెస్ తెలుపుతున్నారు. పవన్ కి సన్నిహితులు అయిన సంగీత దర్శకుడు రమణగోగుల, దర్శకుడు ఎస్ జె సూర్య, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఇప్పటికే శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా దిగ్గజ దర్శకులు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పవన్ ని విష్ చేస్తూ వీడియో సందేశం ఇచ్చారు. 

Scroll to load tweet…

రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. చిరంజీవి గారి కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పవన్ ఏ పని అయినా ఒక దీక్ష లాగా చేసేవాడు. అదే దీక్షతో హీరోగా కూడా రాణించాడు. కోట్లాది అభిమానులని సొంతం చేసుకున్నాడు. అదే విధంగా ప్రజలకి ఏదో మంచి చేయాలనే తపనతో జనసేన పార్టీని స్థాపించారు. జనసేన పార్టీ 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నా అని రాఘవేంద్ర రావు అన్నారు. 

Scroll to load tweet…

ఇదిలా ఉండగా మార్చి 14న జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ మచిలీపట్టణం లో జరగబోతోంది. ఈ సభకి కనీవినీ ఎరుగని విధంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ సభకోసం పవన్ ఇప్పటికే ఏపీకి బయలుదేరారు. ఈ సందర్భంగా పవన్ లేటెస్ట్ లుక్ వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ బ్లాక్ షర్ట్.. మిలిటరీ ప్యాంట్ ధరించి రఫ్ అండ్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.