పచ్చ జెండా హిందూపురం తోపాటు ఆంధ్ర మొత్తం ఎగురుతుంది.. భగవంత్ కేసరి సక్సెస్ మీట్ లో రాఘవేంద్ర రావు
రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. ఈ చిత్రంలో బాలయ్య నటించిన ఎమోషనల్ సీన్స్ చూస్తే స్వర్గీయ ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు అని అన్నారు.

నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి లాంటి హిట్స్ తర్వాత బాలయ్య మరో హిట్ కొట్టేశారు. అనిల్ రావిపూడి, బాలయ్య కాంబినేషన్ లో తొలిసారి వచ్చిన చిత్రం ఇదే.
అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో అనిల్ రావిపూడి ఆడపిల్లల గురించి ఇచ్చిన మెసేజ్ అందరికీ చేరువవుతోంది. శ్రీలీల బాలయ్య కుమార్తెగా నటించగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం విజయం సాధించిన సందర్భంగా నేడు సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు.
ఈ వేడుకకి రాఘవేంద్ర రావు అతిథిగా హాజరయ్యారు. రాఘవేంద్ర రావు వేదికపై మాట్లాడుతూ చేసిన పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. ఈ చిత్రంలో బాలయ్య నటించిన ఎమోషనల్ సీన్స్ చూస్తే స్వర్గీయ ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు అని అన్నారు. బాలయ్య డైలాగ్ చెబితే బాంబు పేలినట్లుగా ఉంటుంది.
కానీ బాంబు కన్నీళ్లు పెట్టుకోవడం చూశా. బాలయ్యకి సీజన్ తో సంబంధం లేదు. వర్షాకాలం అయితే చినుకు జై బాలయ్య అంటూ శబ్దం చేస్తాయి. వేసవిలో సూర్య కిరణాలు కూడా జై బాలయ్య అంటూ వస్తాయి. చలికాలంలో పిల్లగాలికి పచ్చ జెండాలు జై బాలయ్య అంటూ రెపరెపలాడతాయి. హిందూ పురంలోనే కాదు ఆంధ్ర మొత్తం పచ్చ జెండాలు రెపరెపలాడతాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.