దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఆ మధ్యన పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేయడంతో ఒక రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. రీసెంట్ గా తమ్మారెడ్డి ఆర్ఆర్ఆర్ చిత్రంపై విమర్శలు చేస్తూ చేసిన వ్యాఖ్యలు అభిమానులని ఆగ్రహానికి గురయ్యారు చేశారు .
దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఆ మధ్యన పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేయడంతో ఒక రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. రీసెంట్ గా తమ్మారెడ్డి ఆర్ఆర్ఆర్ చిత్రంపై విమర్శలు చేస్తూ చేసిన వ్యాఖ్యలు అభిమానులని ఆగ్రహానికి గురయ్యారు చేశారు . ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ఆస్కార్స్ కోసం ఏకంగా రూ 80 కోట్లు ఖర్చు చేసింది అంటూ తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒక తెలుగు చిత్రం అంతర్జాతీయ వేదికలపై వెలుగు వెలుగుతుంటే సపోర్ట్ చేయాల్సింది పోయి ఇలా విషం కక్కడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరికొన్ని రోజుల్లో ఆస్కార్ అవార్డుల వేడుక జరుగనుంది. ఈ తరుణంలో తమ్మారెడ్డి చేసిన కామెంట్స్ ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకున్నారు. ఇదిలా ఉండగా సినీ ప్రముఖులు కూడా తమ్మారెడ్డికి కౌంటర్ ఇవ్వడం ప్రారంభించారు.
దిగ్గజ దర్శకుడు, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తమ్మారెడ్డికి ఇచ్చిన కౌంటర్ చూస్తే.. సింపుల్ గా ఉతికి ఆరేసినట్లే అనిపిస్తుంది. 'మిత్రుడు భరద్వాజ్ కి.. తెలుగు సినిమాకి, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకి ప్రపంచ వేదికలపై వస్తున్న పేరుని చూసి గర్వపడాలి. అంతే కానీ 80 కోట్ల ఖర్చు అని చెప్పడానికి నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా ? జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ వంటి వారు డబ్బు తీసుకుని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా ?అంటూ రాఘవేంద్ర రావు తమ్మారెడ్డి ఉతికారేశారు.
రాఘవేంద్ర రావు చేసిన ట్వీట్ కి నెటిజన్ల నుంచి, ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ నుంచి మద్దతు లభిస్తోంది. ఆస్కార్స్ ప్రమోషన్స్ కోసం ఆర్ఆర్ఆర్ టీం 80 కోట్లు ఖర్చు చేసింది. ఆ 80 కోట్లు మాకిస్తే 8 సినిమాలు చేసి ముఖాన కొడతాం అంటూ తమ్మారెడ్డి ఇటీవల కామెంట్స్ చేశారు. మునుపెన్నడూ లేని విధంగా తెలుగు సినిమాకి, రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్ కి అంతర్జాతీయ వేదికలపై గౌరవం దక్కుతోంది. ఈ తరుణంలో తమ్మారెడ్డి కామెంట్స్ పూర్తిగా మిస్ ఫైర్ అయ్యాయి అనే చెప్పాలి.
