కేరళకు లారెన్స్ రూ.కోటి విరాళం!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 23, Aug 2018, 11:52 AM IST
Raghava Lawrence to donate 1 crore for Kerala flood relief
Highlights

కేరళ వరద బాధితుల సాహాయార్దం సామాన్య ప్రజల నుండి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా విరాళాలు ప్రకటిస్తున్నారు. వారికి ఆహార పదార్ధాలు, బట్టలు, దుప్పట్లు, మందులు ఇలా అవసరమైనవన్నీ అందిస్తున్నారు.

కేరళ వరద బాధితుల సాహాయార్దం సామాన్య ప్రజల నుండి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా విరాళాలు ప్రకటిస్తున్నారు. వారికి ఆహార పదార్ధాలు, బట్టలు, దుప్పట్లు, మందులు ఇలా అవసరమైనవన్నీ అందిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది తారలు భారీ విరాళాలను ప్రకటించగా తాజాగా నటుడు రాఘవ లారెన్స్ కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించి వార్తల్లో నిలిచాడు.

అంతటితో ఆగకుండా వరద బాధితులకు నేరుగా సహాయం అందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టాడు. ''హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్.. నేను కేరళకు కోటి రూపాయలు విరాళంగా ఇవ్వాలనుకుంటున్నాను. వరదల కారణంగా కేరళ ప్రజలు ఎదుర్కొన్న బాధలు నన్ను కలచివేశాయి. ఇదంతా చూస్తున్నప్పుడు నాకు స్వయంగా వెళ్లి వారికి సహాయం చేయాలనిపించింది కానీ అన్ని ప్రాంతాలకు వెళ్లడం కష్టమని అధికారులు తెలిపారు. వర్షాలు తగ్గేవరకూ నన్ను ఆగమని చెప్పారు.

ఇప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఇదే సరైన సమయమని భావిస్తున్నాను. ప్రభుత్వం సహాయంతో ముందుకు వెళ్లాలనుకుంటున్నాను. కేరళ సీఎంని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఆయన్ని కలిసి విరాళం అందించి ప్రజలకు నేరుగా సర్వీస్ చేసే అవకాశం కల్పించమని కోరనున్నాను. ఇప్పటివరకు కేరళకు సహాయం అందించినవారికి, అందించబోయే వారికి నా కృతజ్ఞతలు'' అంటూ పోస్ట్ పెట్టారు. విరాళం ఇవ్వడంతో పాటు నేరుగా సర్వీస్ చేయాలనుకుంటున్న లారెన్స్ ని అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.   

loader