Asianet News TeluguAsianet News Telugu

భయంకరమైన వ్యాధితో బాధపడ్డ రాఘవ లారెన్స్..? అందుకే ఆ పనిచేస్తున్నాడా..?

మల్టీ టాలెంట్ తో ఇండస్ట్రీలో ఎదిగాడు రాఘవ లారెన్స్.  కొరియోగ్రాఫర్ గా స్టార్ట్ అయ్యి..నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, ఆకరికి సింగర్ గా కూడా మారాడు రాఘవ. ఈక్రమంలో ఆయనకు సబంధించినో ఓ న్యూస్ ప్రస్తుంత సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Raghava lawrence suffering with disease JMS
Author
First Published Nov 28, 2023, 5:12 PM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అతి తక్కువ మంది మల్టీ టాలెంటెడ్ స్టార్స్ లో రాఘవ లారెన్స్ ఒకరు.  నటుడిగా కొరియోగ్రాఫర్ గా దర్శకుడిగా, నిర్మాతగా  ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు  రాఘవ లారెన్స్.  ప్రస్తుతం ఈయన ఇండస్ట్రీలో  హీరోగా నటిస్తూనే.. తన సినిమాలు ఎక్కువగా తానే డైరెక్ట్ చేసుకుంటున్నాడు. మరోవైపు కొరియోగ్రాఫర్ గా కూడా పనిచేస్తున్నారు. ఇలా తెలుగు తమిళ భాషల్లో నటిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి లారెన్స్ గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. 

లారెన్స్ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్న సమాజా సేవకు ఎక్కువగా టైమ్ కేటాయిస్తుంటాడు. తన సంపాదనలో ఎక్కువగా సామాజిక సేవ కార్యక్రమాలకే పెడుతుంటాడు. లారెన్స్ ఇప్పటికే తన ట్రస్టు ద్వారా ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి.. వారికి కొత్త జన్మనిచ్చాడు. అంతే కాదు వారి పాలిట దేవుడయ్యాడు. అంతే కాదు చవువుకొనే తెలివి ఉండి.. ఆర్ధిక స్థోమత లేనివారిని చదివిస్తూ.. వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు. ఇలా తన ట్రస్టు ద్వారా ఎంతో మందికి సేవ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. 

అయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చావు బ్రతుకుల మధ్య ఉన్న చిన్నారుల ప్రాణాలు కాపాడుతున్న రాఘవ.. చిన్నప్పుడు ఇలాంటి ప్రాణాంతక వ్యాధి నుంచి బయట పడ్డారట. లారెన్స్ పేరుకు రాఘవా అని ఉంటుంది. ఆయన రాఘవేంద్రుని బాగా కొలుస్తారు. అయితే ఈ సమాజ సేవకు, రాఘవ పేరుకు, చిన్నతనంలో లారెన్స్ కు వచ్చిన వ్యాధికి.. ఈమూడింటికి ఓ కామన్ లింక్ ఉంది. అదేంటంటే.. చిన్న వయసులోనే బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడ్డారట లారెన్స్. పుట్టుకతో అతనికి పెట్టిన పేరు లారెన్స్ మాత్రమే. బ్రెయిట్ ట్యూమర్ వచ్చిన తరువాత  ఈ వ్యాధి కోసం తన తల్లి ఎంతోమంది డాక్టర్ల దగ్గర చికిత్స తీసుకున్నప్పటికీ తగ్గలేదట. 

దాంతో ఆమె శ్రీ మంత్రాలయం  రాఘవేంద్ర స్వామిని పూజిస్తూ మరోవైపు తన కొడుకుకు చికిత్స అందించడంతో తన కొడుకుకి ఈ వ్యాధి తగ్గిపోయిందని తెలుస్తోంది. దాంతో వీరి ఫ్యామిలీ అంతా శ్రీరాఘవేంద్రుడికి భక్తులుగా మారిపోయారు. తన పేరకు రాఘవ అని తగిలించుకున్నాడు లారెన్స్. ఇక ఆతరువాత తన కెరీర్ గురించి తెలిసిందే. ఇక తనుచిన్నప్పుడు పడిన బాధ. తన గురించి తన తల్లి ఎంత తల్లడిల్లిందో చూసిన తరువాత ఏ తల్లి కూడా ఇలా తన చిన్నారి బిడ్డల గురించి ఇలా విలవిల్లాడొద్దు అన్న ఉద్దేశ్యంతోనే.. రాఘవ ఇలా ప్రాణాపాయంలో ఉన్న చిన్నారులకు ట్రీట్మెంట్ చేయించి కాపాడటం స్టార్ట్ చేశాడట. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios