హీరోగా బిజీగా ఉన్న రాఘవ లారెన్స్.. ఓ సంచలన ప్రకటన చేశారు. తన ట్రస్ట్ కి ఎవరూ విరాళాలు పంపించవద్దన్నారు. అలా చెప్పటానికి గల కారణమేంటనే దానిపై లారెన్స్ తాజాగా ఓ వీడియో విడుదల చేశారు.
కొరియోగ్రాఫర్, నిర్మాత, డైరెక్టర్, హీరో రాఘవ లారెన్స్ మల్టీ టాలెంటెడ్‌గా రాణిస్తున్నారు. సినిమాల్లో హీరోనే కాదు, రియల్ లైఫ్‌లోనూ ఆయన హీరో అనిపించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. చాలా వరకు ఆయన సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. ఆయా కార్యక్రమాలను ఎంతో ఇష్టంగా చేస్తుంటారు. చాలా కాలంగా ఆయన సుమారు 60 మంది పిల్లలను పెంచడంతోపాటు వారి స్టడీస్‌కి సంబంధించిన అన్నీ తనే చూసుకుంటున్నాఉ. అలాగే చాలా మంది పిల్లలకు హార్ట్ ఆపరేషన్ చేయిస్తుంటారు. అలాగే వికలాంగులకు డాన్సు నేర్పించడం చేస్తున్నారు.
ప్రస్తుతం హీరోగా బిజీగా ఉన్న రాఘవ లారెన్స్.. ఓ సంచలన ప్రకటన చేశారు. తన ట్రస్ట్ కి ఎవరూ విరాళాలు పంపించవద్దన్నారు. అలా చెప్పటానికి గల కారణమేంటనే దానిపై లారెన్స్ తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ ..`నా ట్రస్ట్ కి ఎవరూ డబ్బులు పంపొద్దు, నా పిల్లల్ని నేనే చూసుకుంటా అని కొన్ని రోజుల ముందు రిక్వెస్ట్ చేస్తూ నేను ఒక ట్వీట్ వేశాను. అందుకు కారణమేంటంటే నేను డాన్స్ మాస్టర్ గా ఉన్నప్పుడు ఓ ట్రస్ట్ ను స్టార్ట్ చేశాను. అందులో 60 మంది పిల్లల్ని పెంచటం, వికలాంగులకు డాన్స్ నేర్పించటం, ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయించటం వంటి కార్యక్రమాలను నిర్వహించాను. ఈ పనులన్నింటినీ నేను ఒకడ్నినే చేయలేకపోయాను. అందుకనే ఇతరుల నుంచి సాయం కావాలని కోరాను.
అప్పుడు రెండేళ్లకు ఓసినిమానే చేసేవాడిని. కానీ ఇప్పుడు సంవత్సరానికి మూడు సినిమాలు చేస్తున్నాను. బాగానే డబ్బులు వస్తున్నాయి కదా, నాకు నేనే చేయొచ్చు కదా, ఇతరులను ఎందుకు అడిగి చేయాలని నాకే అనిపించింది. నేను పొగరుతో ఇతరులు సేవ కోసం ఇచ్చే డబ్బులను వద్దనటం లేదు. నాకు ఇచ్చే డబ్బులను మీకు దగ్గరలో డబ్బుల్లేక కష్టపడే ట్రస్టులు చాలానే ఉన్నాయి. అలాంటి వారికి సాయం చేయండి. వారికెంతో ఉపయోగపడుతుంది. వారికి చాలా మంది సాయం చేయరు. నేను ఎంత చెప్పినా కొందరైతే నాతో కలిసే సాయం చేస్తామని అంటున్నారు. చాలా సంతోషం. ఆర్థిక ఇబ్బందులో బాధపడేవారెవరో నేనే చెబుతాను. మీరే సాయం చేయండి. అది మీకు ఎంతో సాయాన్ని కలిగిస్తుంద`ని వెల్లడించారు లారెన్స్.
'చంద్ర ముఖి 2' ఆడియో లాంచ్ ఈవెంట్ లో లారెన్స్ నిర్వహిస్తోన్న ట్రస్ట్ కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్. ఈ డబ్బుతో పాటు తను కూడా కొంత డబ్బు వేసుకుని ఓ స్థలం కొని అందులో సుభాస్కరన్ తల్లి పేరు మీద బిల్డింగ్ కడతానని అన్నారు. తన స్టూడెంట్స్ ఆ బిల్డింగ్ లో డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటారని లారెన్స్ పేర్కొన్నారు. ఇక రాఘవ లారెన్స్ నటిస్తున్న `చంద్రముఖి 2` సెప్టెంబర్ 15న విడుదల కాబోతుంది. ఇది రజనీకాంత్ నటించిన `చంద్రముఖి`కి సీక్వెల్. పి. వాసు దర్శకత్వం వహిస్తున్నారు. కంగనా రనౌత్ చంద్రముఖి పాత్రలో కనిపించబోతుంది.
