Asianet News TeluguAsianet News Telugu

దయచేసి అనుమతించండి.. కేరళ ప్రభుత్వాన్ని వేడుకున్న హీరో

పేద జర్నలిస్ట్ కోసం కేరళ ప్రభుత్వానికి లేఖ రాసిన రాఘవ లారెన్స్‌. ప్రభుత్వ ఆసుపత్రిలోని జర్నలిస్ట్ తల్లి మృతదేహాన్ని తమిళనాడకు రప్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్న లారెన్స్‌.

Raghava Lawrence Request to Kerala CM
Author
Hyderabad, First Published May 9, 2020, 9:33 AM IST

డాన్సర్‌గా కెరీర్‌ ప్రారంభించి తరువాత కొరియోగ్రాఫర్‌గా, దర్శకుడిగా, హీరోగా ఎదిగిన కోలీవుడ్ స్టార్ రాఘవ లారెన్స్‌. అయితే సినిమాలతో పాటు తన సేవా కార్యక్రమాలతోనూ మంచి పేరు తెచ్చుకున్నాడు లారెన్స్‌. ఎంతో మందికి సేవలు చేస్తూ తన మంచి మనసు చాటుకుంటున్నాడు లారెన్స్‌. వేల మంది బాగోగులు చూసుకోవటంతో పాటు ఎంతో మందికి గుండె ఆపరేషన్‌లు చేయించటం లాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాడు. ప్రస్తుతం కరోనా సందర్భంగా కూడా తన వంతు సాయం అంధిస్తున్నాడు లారెన్స్. ఇప్పటికే ప్రభుత్వానికి విరాళం ప్రకటించిన లారెన్స్ తాజాగా తమిళనాడు ముఖ్య మంత్రి పినరయి విజయన్‌కు మరో అభ్యర్థనతో లేఖ రాశాడు.

`కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్చలు చాలా బాగున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి సహాయనిధికి మా అమ్మగారితో వచ్చి మిమ్మల్ని కలిసే అవకాశం రావటం గౌరవంగా భావిస్తున్నాను. మీకు ఒక చిన్న విన్నపంగా లేఖ రాస్తున్నాను. తిరువనంతపురంలోని ఎన్‌ఐఎంఎస్‌ వైద్యశాలలో తమిళనాడుకు చెందిన పేద జర్నలిస్ట్ అశోక్‌ తల్లి అనారోగ్యంతో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించారు. ఆమె భౌతికకాయాన్ని కన్యాకుమారి దగ్గరలోని సొంత గ్రామానికి తీసుకొని వెళ్లాలి.

అక్కడి వైధ్య కళాశాలకు అశోక్‌ లక్షన్నర చెల్లించాల్సి ఉంది. అతను చెల్లించలేడు. ఆ మొత్తాన్ని రెండు రోజులు నేనే చెల్లిస్తాను. కావున మీరు పెద్ద మనసుతో కాస్త సహకరించి ఆమె భౌతిక కాయాన్ని పంపించేందుకు సహకరించండి` అంటూ కోరారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios