Asianet News TeluguAsianet News Telugu

చంద్రముఖీ 2 సినిమాకు భారీ ఆఫర్...? ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతున్న మూవీ.

ఇలా రిలీజ్ అయ్యిందో లేదో.. అలా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది చంద్రముఖీ2 మూవీ. రిలీజ్ అయ్యి ఎంతో కాలం అవ్వడంలేదు.. అప్పుడే ఓటీటీకి వచ్చేస్తోంది మూవీ. ఇంతకీ ఎంత డీల్ కుదుర్చకుందంటే..? 

Raghava Lawrence Chandramukhi 2 movie Ott release Update JMS
Author
First Published Oct 18, 2023, 11:55 AM IST

ఇలా రిలీజ్ అయ్యిందో లేదో.. అలా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది చంద్రముఖీ2 మూవీ. రిలీజ్ అయ్యి ఎంతో కాలం అవ్వడంలేదు.. అప్పుడే ఓటీటీకి వచ్చేస్తోంది మూవీ. ఇంతకీ ఎంత డీల్ కుదుర్చకుందంటే..? 


దాదాపు 18 ఏళ్ల క్రితం సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా.. హరర్ కామెడీ మూవీగా ఆడియన్స్ ముందుకు వచ్చింది చంద్రముఖి. పి.వాసు డైరెక్ట్ చేసిన మూవీలో జ్యోతిక చంద్రముఖిగా నటించి ఎంతలా భయపెట్టిందో అందరికి తెలిసిందే.  అప్పటిలో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇన్నాళ్లు తరువాత ఆ మూవీకి ఇప్పుడు సీక్వెల్ ని తీసుకు వచ్చాడు దర్శకుడు వాసు. అయితే ఈ మూవీలో హీరోగా రజినీకాంత్ ను తీసుకోవాలి అనుకున్నారు. కాని ఆయన సున్నితంగా తిరస్కరించడంతో.. ఆయనకి బదులు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) ని తీసుకున్నాడు. 

 

ఇక చంద్రముఖిగా జ్యోతిక ప్లేస్ లో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) నటించింది. అయితే చంద్రముఖి పాత్రలో కంగనా రనౌత్ అస్సలు బాలేదు అనే విర్షలు వినిపిస్తున్నాయి. అంతే కాదు పాత చంద్రముఖి సినిమాకు  వచ్చిన రెస్పాన్స్ లో సగం కూడా సాధించలేకపోయింది చంద్రముఖి 2. అయితే రిలీజ్అయ్యి నెలరోజులు కూడా అవ్వకముందే.. ఓటీటీ కి డీల్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. 

 

కంగనా రనౌత్, రాఘవ లారెన్స్ కలిసి నటించిన ఈసినిమా  సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే బాక్సాఫీస్ దగ్గర అంత మెరుగైన కలెక్షన్స్ కనిపించకపోయినా.. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌కు మాత్రం భారీగా డిమాండ్ ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా చంద్రముఖి 2 గురించి అప్పుడే వార్తలు వైరల్ అయ్యాయి. కొన్ని క్లాసిక్ లు టచ్ చేయకూడదు అని ఈసినిమా సీక్వెల్ నిరూపించింది. ఎన్నో అంచనాల నడుమ దేశ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈసినిమా  28 కోట్లను కలెక్ట్ చేసింది.


చంద్రముఖి 2 ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు సమాచారం. దీనికోసం మూవీ టీమ్‌కు నెట్‌ఫ్లిక్స్.. 10 కోట్ల వరకూ ఆఫర్ చేసిందట. మామూలుగా ఒక సినిమా థియేటర్‌లో విడుదలయిన 6 నుండి 8 వారాల వరకు ఓటీటీలో విడుదల చేయకూడదు కాబట్టి నవంబర్ చివర్లో లేదా డిసెంబర్ మొదట్లో.. చంద్రముఖి 2 నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవ్వనుందని సమాచారం. ఓవైపు చంద్రముఖి 2 రిలీజ్ అయ్యిందో లేదో.. వెంటనే కంగనా రనౌత్.. తన తరువాతి సినిమాలతో బిజీ అయిపోయింది. ఇప్పటికే ‘ఎమర్జెన్సీ’ని విడుదలకు సిద్ధం చేసిన కంగనా.. తాజాగా ‘తేజస్’ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఎప్పుడూ బోల్డ్ పాత్రలకే ఓటు వేసే ఈ బాలీవుడ్ క్వీన్.. ప్రస్తుతం ప్రయోగాత్మక సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios