రాఘవ లారెన్స్ సూపర్ హిట్ చిత్రం కాంచన హిందీలో లక్ష్మి బాంబ్ పేరుతో తెరకెక్కుతోంది. ఇందులో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. లారెన్సే ఈ చిత్రానికి కూడా దర్శకుడు. కానీ చిత్ర యూనిట్ తో విభేదాల కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు లారెన్స్ ఇటీవల ప్రకటించాడు. లక్ష్మీబాంబ్ చిత్ర యూనిట్ లారెన్స్ ని సంప్రదించకుండా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. 

దీనితో మనస్తాపానికి గురైన లారెన్స్ లక్ష్మిబాంబ్ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. వివాదాల పరిష్కారం కావడంతో తాజాగా లారెన్స్ లక్ష్మి బాంబ్ చిత్రంలోకి వచ్చేశాడు. ఈ విషయాన్ని లారెన్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. మీరంతా కోరుకుంటున్నట్లే తిరిగి లక్ష్మీ బాంబ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నా. నా ఫీలింగ్స్ అర్థం చేసుకుని సమస్యని పరిష్కరించిన అక్షయ్ కుమార్ సర్ కు కృతజ్ఞతలు. 

నిర్మాత షబీనా ఖాన్ కు కూడా కృతజ్ఞలు. వీరిద్దరూ నాకు గౌరవం ఇచ్చారు. ఈ చిత్రానికి పనిచేయడానికి నాకు చాలా సంతోషంగా ఉంది అని లారెన్స్ ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న సమయంలో తనకు అక్షయ్ కుమార్ తో ఎటువంటి విభేదాలు లేవని లారెన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.