ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై పెద్దన్న పాత్ర పోషించే బాలీవుడ్ కి ఈ మధ్య సౌత్ నుంచి స్ట్రాంగ్ కౌంటర్లు వస్తున్నాయ్. ఫ్యాన్ ఇండియన్ సినిమాలు నేషనల్ వైడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్నాయి. అయితే సౌత్ సినిమాను తక్కువ చేసి చూడడం బాలీవుడ్ కి ముందు నుంచి అలవాటే.. 

రీసెంట్ గా కాంచన రీమేక్ విషయంలో లారెన్స్ కి చేదు అనుభవం ఎదురైంది. అక్షయ్ కుమార్ హీరోగా లారెన్స్ డైరెక్షన్ లో కాంచన కథను లక్ష్మి బాంబ్ గా తెరకెక్కిస్తున్నారు. అయితే చిత్ర యూనిట్, లారెన్స్ అనుమతి లేకుండా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయడమే కాకుండా సరైన గౌరవం ఇవ్వకపోవడంతో లారెన్స్ సినిమా చేయనని తప్పుకున్నాడు. ఇక అక్షయ్ ఫ్యాన్స్ అలాగే లారెన్స్ ఫ్యాన్స్ ఈ విషయంలో చిత్ర యూనిట్ పై మండిపడ్డారు. ఈ కథకు సరైన దర్శకుడు లారెన్స్ అంటూ లారెన్స్ పై కూడా ఒత్తిడి పెంచారు. 

సమాధానమిచ్చిన లారెన్స్ నేడు చిత్ర నిర్మాతలతో మీటింగ్ ఉందని ఆ వారు మాట్లాడే విధానాన్ని బట్టి నా నిర్ణయం ఉంటుందని అన్నారు. అదే విధంగా నేను గౌరవం ఇవ్వలేని చోట పని చేయలేను అని చెబుతూ.. అభిమానులు నన్ను సినిమాకు దర్శకత్వం వహించమని అడుగుతున్నారు. అందుకు వారికి ఈ వివరణ ఇస్తున్నట్లు లారెన్స్ సమాధానమిచ్చాడు.