ఇప్పుడున్న పరిస్దితుల్లో సినిమాని థియోటర్స్ల్ లో రిలీజ్ చేయటం అనేది ఓ పెద్ద సాహసంగా మారింది. సినిమా ని ధైర్యంగా రిలీజ్ చేస్తే జనాలు థియోటర్స్ కు వచ్చి చూస్తారా లేదా అన్నది తెలియదు. అందుకే సాధ్యమైన మేరకు చాలా సినిమాలు ఓటీటికే ఇచ్చేస్తున్నారు. అయితే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం సోలో బ్రతుకే సో బెటర్ విషయంలో మాత్రం నిర్మాతలు ఓ నిర్ణయం తీసుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల చేయనున్నట్టుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా ప్రకటన తర్వాత అదే రోజు మరో సినిమా కూడా తెలుగు వారిని థిటయోటర్స్ లో పలకరించటానికి సిద్దమైంది. ఆ సినిమా మరేదో కాదు రేడియో మాధవ్. మొదట ఓటీటిలోనే ఈ సినిమా రిలీజ్ అనుకున్నప్పటికీ..థియోటర్ లో చూస్తేనే ఈ సినిమా చూస్తే బాగుంటుందనే ఆలోచనతో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. 
 
సినిమా వివరాల్లోకి వెళితే...తమిళ నటుడు విజయ్‌ సేతుపతి నటించిన తొలి మలయాళ చిత్రం ‘మార్కొని మతాయ్‌’. జయరామ్‌ మరో హీరోగా నటించిన ఈ సినిమాకి సనల్‌ కలతిల్‌ దర్శకత్వం వహించారు. లక్ష్మీ చెన్న కేశవ బ్యానర్‌పై నిర్మాత కృష్ణస్వామి ఈ చిత్రాన్ని ‘రేడియో మాధవ్‌’ టైటిల్‌తో తెలుగులో అనువదిస్తున్నారు. ఈ చిత్రం క్రిస్మస్ రోజున రిలీజ్ చేయటానికి నిర్ణయించారు.

‘బిచ్చగాడు’ వంటి పలు డబ్బింగ్ సినిమాలకు తెలుగులో మాటలు, పాటలు రాసిన భాష్య శ్రీ ఈ చిత్రానికి డైలాగ్స్, లిరిక్స్ రాశారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘తెలుగులో వెంకటేష్ గారు నటించిన ‘రాజా’, ‘సంక్రాంతి’ తరహా మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ఇది. మలయాళంలో పెద్ద విజయం సాధించింది. తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. ఎంజాయ్ చేస్తూ చేసిన డబ్బింగ్ సినిమా ఇది’’ అన్నారు.

నిర్మాత కృష్ణస్వామి మాట్లాడుతూ.. “ మా సంస్థ రెండో చిత్రమిది. ఇంతకు ముందు దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి నటించిన ‘హే పిల్లగాడ’ చిత్రాన్ని విడుదల చేశా. ఇప్పుడు ‘రేడియో మాధవ్’ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాను. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా కనిపిస్తారు. తన నిజ జీవిత పాత్రలో ఆయన నటించారు. ‘భాగమతి’, ‘అల.. వైకుంఠపురం..’ చిత్రాలలో నటించిన జయరామ్ ఈ చిత్రంలో మిలటరీ నుంచి బయటకొచ్చి బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తూ ఉండే పాత్ర పోషించారు. ఎఫ్.ఎం. రేడియో స్టేషన్ బ్యాక్ డ్రాప్‌లో నడిచే ప్రేమకథ ఈ ‘రేడియో మాధవ్’ చిత్రం’’ అన్నారు.

సహ నిర్మాత చలం మాట్లాడుతూ.. ‘‘కేరళ పచ్చటి అందాల మధ్య ఉన్న చంగనసేరి అనే చిన్న పట్టణంలో నడిచే చక్కటి సినిమా ‘రేడియో మాధవ్’. ఇందులో పాటలు చాలా బాగుంటాయి. థియేటర్ల పరిస్థితిని బట్టి విడుదలపై నిర్ణయం తీసుకుంటాం’’ అని చెప్పారు.

ఇక  .కమల్ హాసన్ పంచతంత్రం, తుపాకీ, భాగమతి, అల వైకుంఠపురం సినిమాలతో తెలుగువారికి సుపరితుడయ్యాడు జయరాం. మళయాళ నటుడైనప్పటికీ.. తమిళ, తెలుగు సినిమాల్లోనూ తన నటనతో అభిమానుల్ని సంపాదించుకున్నాడు. విజయ్ సేతుపతి, జయరామ్ సహా ఆత్మీయ రాజన్, పూర్ణ, నరేన్, అజూ వర్గీస్ తదితరులు సినిమాలో నటించారు. 

గతంలో ఇదే నిర్మాతలు దుల్కర్‌ చేసిన ‘కలి’ చిత్రాన్ని ‘హే పిల్లగాడ’గా విడుదల చేశారు. ఇప్పుడు మంచి కథాంశంతో రూపొందిన ‘రేడియో మాధవ్‌’ని అందిస్తున్నారు. రేడియో స్టేషన్‌ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే చిత్రమిది  కృష్ణస్వామి. సహనిర్మాత చలం. చిత్ర నిర్వాహకుడు శ్రీనివాస మూర్తి, మాటల రచయిత భాష్య శ్రీ.