చాలా మందికి కొన్ని ఫాంటసీలు ఉంటాయి. వాటిని నిజం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. కానీ హీరోయిన్ రాధికా ఆప్టే మాత్రం తన ఫాంటసీ నెరవేర్చుకోలేకపోయానని ఫీల్ అవుతోంది. చిన్నప్పుడు రాధికా ఆప్టే ఓ అబ్బాయిని ఇష్టపడిందట.

8 ఏళ్ల వయసులో రాధికా తన ఇంటి పనిమనిషితో కలిసి ఎక్కువగా సినిమా చూసేదట. ఆ సినిమాల్లో హీరోయిన్ వర్షంలో తడవడం, ఆమెని హీరో ముద్దాడడం వంటివి చూసి రియల్ లైఫ్ లో తన బాయ్ ఫ్రెండ్ ని అలానే ముద్దు పెట్టుకోవాలని అనుకునేదట.

కానీ అది కలగానే మిగిలిపోయిందని చెబుతోంది. ఇప్పటికీ కూడా ఎవరినీ వర్షంలో తడుస్తూ ముద్దు పెట్టుకోలేదని అంటోంది. మరిన్ని విషయాలు చెబుతూ.. ''స్కూల్ లో ఓ అబ్బాయిని బాగా ఇష్టపడేదాన్ని. నా కలలో అతడిని ఊహించుకునేదాన్ని. అతడు నన్ను ముద్దు పెట్టుకున్నట్లు చాలా సార్లు కలలు కన్నాను. దానికోసమే తొందరగా పడుకునే దాన్ని. కానీ కుదరలేదు'' అంటూ చెప్పుకొచ్చింది.

మహిళలంతా తమ ఫాంటసీల గురించి ఓపెన్ గా మాట్లాడాలని, అందులో సిగ్గు పడాల్సిన అవసరం లేదంటోంది.