ప్రముఖ నటి రాధికా ఆప్టే, దేవ్ పటేల్ జంటగా నటించిన హాలీవుడ్ చిత్రం 'ది వెడ్డింగ్ గెస్ట్'. త్వరలోనే విడుదల కాబోతున్న ఈ సినిమాను ఓ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు. దీంతో సినిమాలోని హాట్ రొమాంటిక్ సీన్ ఒకటి లీకై.. ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది.

రాధికా ఆప్టే, దేవ్ పటేల్ శృంగారంలో పాల్గొన్న ఈ సీన్ లీక్ కావడంపై నటి రాధికా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మన సొసైటీలో సైకో మెంటాలిటీకి ఈ సీన్ లీకే నిదర్శనమని ఆమె మండిపడుతోంది. పైగా ఈ సీన్ తన పేరుతో స్ప్రెడ్ చేస్తుండడంతో ఆమెని మరింత ఆగ్రహానికి గురి చేస్తోంది.

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధికా ఈ విషయంపై మాట్లాడింది. సినిమాలో ఎన్నో అందమైన దృశ్యాలు ఉన్నాయని.. కానీ శృంగారానికి సంబంధించిన సీన్ ను మాత్రమే లీక్ చేశారని దానికి కారణం మన సమాజం సైకోటిక్ మెంటాలిటీనే అని అన్నారు. లీకైన ఫోటోలో తనతో పాటు దేవ్ కూడా ఉన్నాడని.. కానీ తన పేరు మీదే ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారని ప్రశ్నించింది రాధికాఆప్టే.

బోల్డ్ సీన్స్ లో నటించే విషయంలో తనకు ఎలాంటి భయాలు ఉండవని.. చిన్నప్పటి నుండి ప్రపంచ సినిమాలు చూస్తూ పెరిగానని.. ఎన్నో ప్రదేశాలు తిరిగానని.. భారత్, విదేశాల్లో నటులు వేదిక మీద నగ్నంగా నటించడం చూశానని చెప్పుకొచ్చింది. నా శరీరాన్ని చూసి నేనెందుకు సిగ్గుపడాలని ప్రశ్నించింది. ఓ నటిగా తన శరీరం కూడా ఒక సాధనమేనని చెప్పింది.