బాలీవుడ్ తో పాటు కోలివుడ్ లో కూడా మీటూ ఉద్యమం ఉదృతంగా సాగుతుంది. ఇప్పటికీ చాలా మంది తారలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెడుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే కూడా కాస్టింగ్ కౌచ్ పై కామెంట్స్ చేసింది.

అయితే తను మోడలింగ్ కోసం ఏజెన్సీలో జాయిన్ అయిన సమయంలోనే కాస్టింగ్ కౌచ్ కి గురయ్యాను అంటూ చెప్పుకొచ్చింది. ''నీ కెరీర్ ఆరంభంలో కాస్టింగ్ కౌచ్ ని గురయ్యాను. ఐదేళ్ల కిందట మోడలింగ్ కోసం ఏజెన్సీలో జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నాను.

ఆ సమయంలో ఓ నిర్మాత నా పట్ల చాలా నీచంగా ప్రవర్తించాడు. తన బలమంతా నాపై చూపించడానికి ప్రయత్నించాడు. నేను సింపుల్ గా నా మేకప్, ఆర్నమెంట్స్ తీసేసి అతడికి గుడ్ బై చెప్పేసి వచ్చాను.

మీటూ ఉద్యమం సక్సెస్ కావాలంటే అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరికైనా ఈ సమాజంలో పని చేసుకోవడానికి సురక్షితమైన వాతావరణం ఉండాలి. చాలా మంది ఈ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. అసలు వేధింపు అంటే ఏంటో అంతా తెలుసుకోవాలి'' అంటూ చెప్పుకొచ్చింది.