దేశంలో కరోనా వ్యాప్తి అధికమవుతుండగా ఆంక్షలు విధించాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ కారణంగా జనవరి 14న విడుదల కావాల్సిన రాధే శ్యామ్ పోస్ట్ ఫోన్ అయ్యింది. ఈ నేపథ్యంలో కొత్త రిలీజ్ డేట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దీనిపై మేకర్స్ నేడు అధికారిక ప్రకటన చేశారు. 


సమ్మర్ మొత్తం పెద్ద చిత్రాల సందడి నెలకొని ఉంది. కరోనా వ్యాప్తితో పలు చిత్రాలు అనుకున్న సమయానికి విడుదల కాలేదు. దీంతో పదుల సంఖ్యలో చిత్రాలు విడుదలకు నోచుకోకుండా పేరుకుపోయాయి. బడా హీరోలు సమ్మర్ స్లాట్స్ కోసం పోటీపడుతున్నారు. గట్టి పోటీ నెలకొన్న నేపథ్యంలో ఎవరికి వారు త్వరపడుతూ విడుదల తేదీలు ప్రకటిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్, ఆచార్య, సర్కారు వారి పాట(Sarkaru vaari paata), భీమ్లా నాయక్ తో పాటు వెంకీ -వరుణ్ ల మల్టీస్టారర్ ఎఫ్ 3 చిత్రాలు రిలీజ్ డేట్స్ అధికారికంగా ప్రకటించాయి. ఫిబ్రవరి 25 నుండి మే 12 వరకు వారం, రెండు వారాల వ్యవధిలో ఈ బడా చిత్రాలు విడుదల కానున్నాయి. 

ఆచార్య, ఎఫ్ 3 ఒక్క రోజు వ్యవధిలో విడుదల కావడం విశేషం. 28న 'ఎఫ్ 3', 29న ఆచార్య(Acharya) రిలీజ్ కానున్నాయి. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మేకర్స్ రెండు తేదీలు ప్రకటించారు. ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. థియేటర్స్ పై కొనసాగుతున్న కరోనా ఆంక్షలు ఎత్తివేస్తే ఫిబ్రవరి 25న లేదంటే ఏప్రిల్ 1న భీమ్లా నాయక్ (Bheemla nayak)విడుదల కానుంది. ఇక ఆర్ ఆర్ ఆర్ మార్చ్ 25న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. మహేష్ సర్కారు వారి పాట చిత్రాన్ని మే 12న విడుదల చేస్తున్నారు. 

ఎప్పటిలాగే రాధే శ్యామ్ (Radhe shyam)మేకర్స్ కూల్ గా హడావుడి లేకుండా అప్డేట్ ఇచ్చారు. మార్చ్ 11న రాధే శ్యామ్ మూవీ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై నేడు అధికారిక ప్రకటన చేశారు. అప్డేట్ కోసం అసహనంగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ దీంతో ఖుషీ అవుతున్నారు. కాబట్టి మార్చ్ నెలలో రెండు బడా పాన్ ఇండియా చిత్రాలు విడుదల కానున్నాయి. రాధే శ్యామ్ విడుదలైన రెండు వారాలకు ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల కానుంది. 

దర్శకుడు రాధ కృష్ణ పీరియాడిక్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విధిని ప్రేమ ఎదిరించగలదా? అనే ఒక సున్నితమైన పాయింట్ ఆధారంగా రాధే శ్యామ్ రూపొందినట్లు సమాచారం. రాధే శ్యామ్ షూటింగ్ మొదలై మూడేళ్లు దాటిపోయింది. ఎట్టకేలకు మార్చ్ 11న థియేటర్స్ లో దిగనుంది. రాధే శ్యామ్ మూవీలో ప్రభాస్(Prabhas) కి జంటగా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. 

Scroll to load tweet…