రాధే శ్యామ్ కొత్త పోస్టర్ విడుదలైన కాసేపటికే ట్రెండ్ సెట్ చేసింది. అయితే అంతే త్వరగా పోస్టర్ పై నెటిజన్స్ ట్రోలింగ్ కూడా మొదలు పెట్టారు. గతంలో వచ్చిన పోస్టర్ కు ఈ సినిమా పోస్టర్ కాపీలా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకు ముందు విడుదలైన పోస్టర్ సైతం ఇవే కామెంట్స్ ఎదుర్కోవటం గమనార్హం. 

వివరాల్లోకి వెళితే....యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోగా 'జిల్‌' ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'రాధేశ్యామ్‌'. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, టీ సిరీస్‌ బ్యానర్స్‌పై సినిమా నిర్మితమవుతోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ ఇటలీలో జరుగుతోంది. అక్టోబర్‌ 23న హీరో ప్రభాస్‌ పుట్టినరోజు, ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ 'బీట్స్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌' పేరుతో 'రాధేశ్యామ్‌' మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేయబోతున్నారు. 'వాళ్లు మిమ్మల్ని మరోసారి కచ్చితంగా ప్రేమలో పడేస్తారు. అక్టోబర్‌ 23న మోషన్‌పోస్టర్‌ను విడుదల చేస్తున్నాం' అంటూ మేకర్స్‌ ప్రకటించారు.  ఇప్పుడు ఆ పోస్టర్ కాపీ అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. యాంటీ ఫ్యాన్స్ ఇక్కడ చూస్తున్న  ఈ పోస్టర్ ని బయిటకు తీసి ప్రచారంలోకి తెచ్చారంటున్నారు. 

ఇక 'బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్' పోస్టర్ లో రైలు బండి నుంచి దట్టమైన పొగ బయటికొస్తున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంది.  అభిమానులు
అందరూ మెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు ఆ పోస్టర్ కు సంబంధించి ఒరిజినల్ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ పోస్టర్ కి ఈ పోస్టర్ కి కేవలం కలర్ లోనే
డిఫరెన్స్ కనిపిస్తోందని అర్దమవుతోంది. రెండిటినీ పక్క పక్కన పెట్టి 'రాధే శ్యామ్' పోస్టర్ కాపీ అంటూ నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు.  

 పీరియాడికల్‌ లవ్‌స్టోరిగా రూపొందుతోన్నఈ చిత్రంలో ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే నటిస్తుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి  సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ, క‌న్న‌డ‌ భాషల్లో రాధేశ్యామ్ ను విడుద‌ల చేయడానికి చిత్ర నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, స‌త్య‌రాజ్‌, భాగ్య‌శ్రీ, కునాల్ రాయ్ క‌పూర్‌, జ‌గ‌ప‌తిబాబు, జ‌య‌రాం, స‌చిన్ ఖేడ్‌క‌ర్‌, భీనా బెన‌ర్జి, ముర‌ళి శ‌ర్మ‌, శాషా ఛ‌త్రి, ప్రియ‌ద‌ర్శి, రిద్దికుమార్‌, స‌త్యాన్ త‌దిత‌రులు సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస  ఎడిటర్ :  కొటగిరి వెంక‌టేశ్వ‌రావు యాక్ష‌న్‌, స్టంట్స్‌ : నిక్ ప‌వ‌ల్, సౌండ్ డిజైన్ : ర‌సూల్ పూకుట్టి కొరియోగ్ర‌ఫి : వైభ‌వి మ‌ర్చంట్‌ కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌ : తోట విజ‌య భాస్క‌ర్ అండ్ ఎకా ల‌ఖాని వి ఎఫ్ ఎక్స్ సూప‌ర్‌వైజ‌ర్‌ : క‌మ‌ల్ క‌న్న‌న్‌  ఎక్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌ : ఎన్‌.సందీప్‌, హెయిర్‌స్టైల్‌‌ : రోహ‌న్ జ‌గ్ట‌ప్‌  మేక‌ప్‌ : త‌ర‌న్నుమ్ ఖాన్  స్టిల్స్‌ : సుద‌ర్శ‌న్ బాలాజి  ప‌బ్లిసిటి డిజైన‌ర్‌ : క‌బిలాన్‌ పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను  కాస్టింగ్ డైర‌క్ట‌ర్‌ : ఆడోర్ ముఖ‌ర్జి  ప్రోడక్షన్ డిజైనర్ : ర‌‌వీంద‌ర్‌  చిత్ర స‌మ‌ర్ప‌కులు : "రెబ‌ల్‌స్టార్" డాక్ట‌ర్ యు వి కృష్ణంరాజు   నిర్మాతలు: వంశీ, ప్ర‌మోద్, ప్ర‌శీదా  దర్శకుడు : రాధాకృష్ణ కుమార్.