‘రాధేశ్యామ్’ ..ప్రభాస్ కు ఇంకో 'డార్లింగ్'
ఈ సినిమాలో ప్రభాస్ జ్యోతిష్యుడుగా కనిపించనున్నారు. ఈ కథ జ్యోతిష్యానికి, సైన్స్‌కు మధ్య జరిగే అంశాలు చుట్టు తిరిగే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతుందని సినిమాలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న సచిన్ కేడ్కర్ తెలిపారు.
`బాహుబలి` తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం `సాహో`. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం అభిమానులను నిరాశపరిచింది. దాంతో తదుపరి సినిమాతో ఎలాగైనా ప్రభాస్ సూపర్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో రెడీ అవుతున్న చిత్రం ‘రాధేశ్యామ్’. ప్రభాస్, పూజ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఓ పాట షూట్ తో ఈ నెలాఖరక షూటింగ్ పూర్తవతుంది. విడుదల తేదీ కూడా త్వరలో ఫైనలైజ్ చేస్తారు. ఇక ఈ చిత్రం ప్రభాస్ ప్రత్యేక శ్రద్ద పెట్టడానికి కారణం తనకు బాగా ఇష్టమైన రొమాంటిక్ జానర్ లో కథ ఉండటమే అంటున్నారు.
2010లో అంటే దాదాపు పదకొండేళ్ల క్రితం డార్లింగ్ టైటిల్ తో ఓ అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ చేసారు ప్రభాస్. మళ్లీ అప్పటినుంచి అలాంటి సినిమా చేయలేదు. ఇప్పుడు రాధేశ్యామ్ అలాంటిదే అంటున్నారు. ప్రభాస్, పూజ మధ్య వచ్చే సన్నివేశాలు ఒకటికి నాలుగుసార్లు చూసేలా ఉంటాయని చెప్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ జ్యోతిష్యుడుగా కనిపించనున్నారు.
ఈ కథ జ్యోతిష్యానికి, సైన్స్‌కు మధ్య జరిగే అంశాలు చుట్టు తిరిగే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతుందని సినిమాలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న సచిన్ కేడ్కర్ తెలిపారు. ఈ సినిమాలో తాను ఒక డాక్టర్ పాత్రలో కనిపించనున్నట్లు చెప్పారు. ప్రభాస్ భవిష్యత్తు పట్ల చాలా స్పష్టమైన ఆలోచనలు ఉన్న ఒక వ్యక్తిగా ఈ సినిమాలో కనిపించనన్నుట్లు సచిన్ కేడ్కర్ తెలిపారు. ఇక ఈ సినిమాను డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ ఎలా తెరపై చూపించనున్నారో సినిమా విడుదలైన తరువాత తెలియాల్సి ఉంది.
‘రాధేశ్యామ్’ సినిమాను ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నారు. రెబల్‌స్టార్ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలకానుంది. ప్రభాస్ సరసన హీరోయిన్‌గా పూజాహెగ్డే నటిస్తోంది.