Asianet News TeluguAsianet News Telugu

‘రాధేశ్యామ్‌’కి అమేజాన్ డీల్,కలలో కూడా ఊహించని రేటుకి??

ఓటీటి జెయింట్స్ అమేజాన్,నెట్ ఫ్లిక్స్ రెండూ ఈ సినిమా రైట్స్ కోసం పోటీ  పడ్డాయి. అందులో అమేజాన్ కు ఈ డీల్ ఓకే అయ్యేటట్లు ఉందని సమాచారం. అయితే డిజిటల్ కు మాత్రమే కాకుండా మొత్తం సినిమా నెగిటివ్ రైట్స్ అవుట్ రైట్ డీల్ గా క్లోజ్ చేద్దామని నిర్ణయానికి వచ్చారట. 

Radhe Shyam Got Rs 400 Crore Deal By Amazon? jsp
Author
Hyderabad, First Published Jun 7, 2021, 5:11 PM IST

 ప్రభాస్‌, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై ‘జిల్‌’ఫేమ్‌ రాధాకృష్ణ దర్వకత్వంలో ఈ అందమైన ప్రేమకావ్యం రూపుదిద్దుకుంటోంది. భారీ బడ్జెట్‌తో ‘రాధేశ్యామ్‌’పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. సినిమాను అధికభాగం ఇటలీలోనే చిత్రీకరించారు.  రాధే శ్యామ్ విడుదల కోసం దేశవిదేశాల్లోని ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం డిజిటెల్ బిజినెస్ ఊపందుకుంది. 

అందుతున్న సమాచారం మేరకు ఓటీటి జెయింట్స్ అమేజాన్,నెట్ ఫ్లిక్స్ రెండూ ఈ సినిమా రైట్స్ కోసం పోటీ  పడ్డాయి. అందులో అమేజాన్ కు ఈ డీల్ ఓకే అయ్యేటట్లు ఉందని సమాచారం. అయితే డిజిటల్ కు మాత్రమే కాకుండా మొత్తం సినిమా నెగిటివ్ రైట్స్ అవుట్ రైట్ డీల్ గా క్లోజ్ చేద్దామని నిర్ణయానికి వచ్చారట. 400 కోట్లకు ఈ డీల్ ఓకే అయ్యిందని చెప్పుకుంటున్నారు.సల్మాన్ రాధే లాగ అటు థియోటర్ లోనూ, ఇటు ఓటీటిలలోనూ ఒకే సారి రిలీజ్ చేస్తారు. అయితే ఈ విషయమై అధికారిక సమాచారం  ఏమీ లేదు.

బడ్జెట్ విషయానికి వస్తే.. రాధే శ్యామ్ సినిమాను రూ. 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మిద్దామని ప్లాన్ చేసారు. అయితే కరోనా ఎఫెక్ట్, స్క్రిప్టులో చేసిన మార్పులుతో బడ్జెట్ భారీగా పెరిగిందని సమాచారం. అది 330 కోట్లకు రీచ్ అయ్యిందని వినికిడి. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తూండటంతో రేటు కూడా భారీగానే పలికిందని ట్రేడ్ వర్గాల సమాచారం. 

1960 దశకం నాటి వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ప్రభాస్ సరసన యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్, ఎయిర్‌టెల్‌ భామ శాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జస్టిన్‌ ప్రభాకర్‌ సంగీతం అందిస్తుండగా, మనోజ్‌ పరమహంస తన కెమెరా పనితనాన్ని చూపెట్టనున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios