ఇప్పుడు సల్మాన్ తాజా చిత్రం ‘రాధే’ రిలీజ్ కు హైబ్రీడ్ మోడల్ ని ఎంచుకున్నారు.
కరోనా ఎన్నో మార్పులు తెస్తోంది. ముఖ్యంగా సినిమా రిలీజ్ ల విషయంలో కరోనా తో వచ్చిన మార్పులు అంతా ఇంతా కాదు. అంతకు ముందు పట్టించుకోని ఓటీటి ప్రతీ ఇంట్లోకి వెళ్లింది. అయితే థియోటర్ ఎక్సపీరియన్స్ ముందు ఓటీటి చిన్నబోయిన మాట నిజమే. కానీ ఇప్పుడు మరోసారి కరోనా విజృంభణతో ఓటీటినే ఆశ్రయించాల్సి వస్తోంది. చిన్న సినిమాలకు ఓటీటి ఓకే కానీ పెద్ద సినిమాలకు ఓటీటి రిలీజ్ అనేది ఎంతవరకూ రెవిన్యూ జనరేట్ చేస్తుందనేది ప్రశ్నార్దకంగా మారింది. ఇందుకే ఇప్పుడు సల్మాన్ తాజా చిత్రం ‘రాధే’ రిలీజ్ కు హైబ్రీడ్ మోడల్ ని ఎంచుకున్నారు.
‘రాధే’ ముందు నిర్ణయించుకున్నట్టుగానే రంజాన్‌కు థియేటర్స్‌లో రానున్నాడు. అయితే ఒకేసారి ఇటు థియేటర్స్‌లో అటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది ‘రాధే’. ఓటీటీ డీల్ దాదాపు 230 కోట్లు ఉంటుందని బాలీవుడ్ వర్గాల సమాచారం. గత ఏడాది కరోనా సమయంలో కూడా ఈ సినిమాకు ఓటీటీ ఆఫర్ వచ్చినా ముంబయ్ థియేటర్స్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అభ్యర్ధనల మేరకు సల్మాన్ తన డెసిషన్ ని మార్చుకున్నారు. ఇప్పుడు ఒకేసారి ఓటీటీ, థియేటర్స్‌లో సినిమాను విడుదల చేస్తున్నారు. థియేటర్లతో పాటు ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో జీ ప్లెక్స్, డిష్ టీవీ, డీటుహెచ్, టాటా స్కై, ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీల్లోనూ ‘రాధే’ ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది.
ముంబయ్‌లో థియేటర్స్ మూతబడటం, ఇంకా ఉత్తర, దక్షిణాదిన కొన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీటింగ్ వంటివి ‘రాధే’ సినిమాను ఇలా థియేటర్, ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ స్కీమ్ కనుక వర్కవుట్ అయితే చాలా పెద్ద సినిమాలు అదే దారిలో ప్రయాణం పెట్టుకుంటాయనటంలో సందేహం లేదు. ముఖ్యంగా ప్రభాస్ సినిమాలు కూడా వరస పెట్టి అదే మోడల్ లో రిలీజ్ లు పెట్టుకుంటాయి.
సల్మాన్‌ఖాన్ హీరోగా నటించిన చిత్రం ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’.ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మే 13న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ ఈ రోజే వచ్చింది. మాదక ద్రవ్యాల గురించి చెప్పే సీన్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం అలరిస్తుంది. సల్మాన్ రకరకాల గెటప్‌లో దర్శనమిచ్చి ఆకట్టుకుంటున్నారు. డైలాగులు, డ్యాన్సులతో అదరగొడుతున్నారు. తెలుగులో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రంలోని సీటీమార్ రీమేక్ సాంగ్ లో దిశా పటానీ, సల్మాన్ స్టెప్పులు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. అలాగే జాక్వెలిన్ స్పెషల్ సాంగ్ లో కనిపించి సందడి చేసింది.
