Asianet News TeluguAsianet News Telugu

నగ్మా, `రేసుగుర్రం` విలన్‌ మధ్య ఇంత కథ జరిగిందా? .. ఇన్నాళ్లకి లవ్‌ ఎఫైర్‌పై ఓపెన్‌ అయిన రవికిషన్‌

తెలుగులో విలన్‌గా మెప్పిస్తున్న నటుడు రవికిషన్‌.. ఒకప్పటి అందాల తార నగ్మాతో లవ్‌ ఎఫైర్‌ పెట్టుకున్నట్టు వార్తలొచ్చాయి. తాజాగా ఇప్పుడు దీనిపై స్పందించారు రవికిషన్‌. ఏం జరిగిందో వివరించారు.

race gurram villain ravi kishan open up on love affair with actress nagma arj
Author
First Published Apr 2, 2023, 10:03 AM IST

నటుడు రవికిషన్‌ తెలుగులో విలన్‌గా పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. `రేసుగుర్రం` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో మద్దాలి శివారెడ్డిగా నెగటివ్‌ రోల్‌లో మెప్పించారు. ఒక్కసినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో ఆయనకు తెలుగులో మంచి ఆఫర్లు వచ్చాయి. వరుసగా విలన్‌ రోల్స్ చేస్తూ మెప్పిస్తున్నారు. అయితే చాలా సెలక్టీవ్‌గానే చేస్తున్నారు. తెలుగులోనే కాదు, హిందీ, భోజ్‌పూరీ భాషల్లోనూ ఆయన నటిస్తున్నారు. భోజ్‌పూరీ భాషలో ఏకంగా హీరోగా స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. హిందీలో పదుల సినిమాలు చేసి నటుడిగా ఎదిగాడు. 

అయితే హీరోగా భోజ్‌పూరీలో రాణించే క్రమంలో ఆయన ఎక్కువగా నగ్మాతో సినిమాలు చేశారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య లవ్‌ ఎఫైర్‌ ఉందనే పూకార్లు ఊపందుకున్నాయి. అప్పట్లో అవి హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై నటుడు రవికిషన్‌ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలపై ఓపెన్‌ అయ్యారు. నగ్మాతో కలిసి ఎక్కువ సినిమాలు చేయడం వల్లే ఇలాంటి రూమర్లు వచ్చాయని తెలిపారు. ఆమెతో కలిసి నటించిన సినిమాలు చాలా వరకు పెద్ద హిట్‌ అయ్యాయి. పైగా తామిద్దరం మంచి స్నేహితులమని, దీని కారణంగానే ఎక్కువ సినిమాలు చేశామని తెలిపారు రవికిషన్‌. 

`అప్పటికే నాకు పెళ్లి అయ్యింది. నా భార్య ప్రీతి శుక్లాని నేను చాలా గౌరవిస్తా. నేను ఆమె పాదాలకు నమస్కరిస్తా, నా భార్య మొదట్నుంచి నాతో ఉంది. నా వద్ద డబ్బులు లేనప్పుడు కూడా ఆమె నాతోనే ఉంది. కానీ వరుసగా నా సినిమాలు హిట్‌ కావడంతో నేను చాలా గర్వంగా ప్రదర్శించా, ఆ సమయంలో నన్ను బిగ్‌ బాస్‌ షోకి వెళ్లమని నా భార్య సూచించింది. మొదట ఇష్టం లేకపోయినా తర్వాత వెళ్లాను. మూడు నోలల పాటు హౌజ్‌లో ఉండటంతో నాలో చాలా మార్పు వచ్చింది. ఈ షో ద్వారా నేను పాపులర్ కావడమే కాదు, వ్యక్తిగా చాలా మారిపోయా, సాధారణ వ్యక్తిగా మారాను. ఆ తర్వాత నా కుటుంబాన్ని, నాభార్య పిల్లలను బాగా చూసుకున్నా` అని తెలిపాడు రవికిషన్‌. 

రవికిషన్‌ `రేసుగుర్రం` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. `ఆగడు`, `కిక్‌2`, `బ్రూస్‌ లీ`, `సుప్రీమ్‌`, `రాధ`, `లై`, `ఎంఎల్‌ఏ`, `సాక్ష్యం`, `ఎన్టీఆర్‌ కథానాయకుడు`, `సైరా`, `గద్దలకొండ గణేష్‌`, `హీరో` వంటి చిత్రాల్లో నటించారు. హిందీ, భోజ్‌పూరీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ నటించి మెప్పిస్తున్నారు రవికిషన్‌. ఇదిలా ఉంటే ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన లోకసభ ఎంపీగా ఉత్తర ప్రదేశ్‌ లోని గోరక్‌పూర్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios