సుశాంత్ సింగ్, కృతీ సనన్ హీరోహీరోయిన్లుగా రాబ్తా చిత్రం ఈ బాలీవుడ్ చిత్రం మగధీర కాపీ అంటూ ఆరోపణలు కోర్టుకెక్కి నిరూపించి డీల్ సెట్ చేసుకున్న అల్లు అరవింద్
సుషాంత్ సింగ్ రాజ్ పుత్.. కృతి సనన్ లు నటించిన బాలీవుడ్ చిత్రం రాబ్తా చిత్రం గతంలో ఘన విజయం సాధించిన మగధీర కాపీ అంటూ జరిగిన ప్రచారం నిజమే అని తేలింది. రాబ్తా తమ మగధీర సినిమాను కాపీ కొట్టి తీస్తున్నదేనంటూ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కోర్టులో కేసు వేయటం ఇటీవల హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. ఈ సినిమాను తాము కాపీ కొట్ట లేదంటూ రాబ్తా నిర్మాతలు చెప్పుకున్నారు. అయితే కాపీరైట్ కేసు విషయంలో వెనక్కి తగ్గేది లేదని అల్లు అరవింద్ తేల్చి తెప్పడంతో.. ఈ ఇష్యూకు పుల్ స్టాప్ పెట్టదలచిన రాబ్తా నిర్మాతలు వెనక్కి తగ్గి అల్లు అరవింద్ తో రాజీ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
కేసును కోర్టు బయట చర్చల ద్వారా సెట్ చేసుకుందామన్న రాబ్తా నిర్మాతల ఆహ్వానాన్ని నిర్మాత అల్లుఅరవింద్ ఓకే చేసినట్లుగా సమాచారం. మధ్యవర్తుల సమక్షంలో.. ఇష్యూను సున్నితంగా డీల్ చేసి చర్చల ద్వారా క్లోజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ కేసు క్లోజ్ చేసేందుకు అల్లుి అరవింద్ కు బాగానే ముట్టజెప్పినట్లు సమాచారం.
దీంతో.. కోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకోవటం వల్ల రాబ్తా రిలీజ్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు. మొత్తానికి కాపీ ఆరోపణలు నిజమేనన్న విషయాన్ని అల్లు అరవింద్ కోర్టులో తేల్చినట్లుగా తెలుస్తోంది. అయితే.. బయట కామ్ గా డీల్ సెట్ అయినా.. సెటిల్ మెంట్ అమౌంట్ ఎంతన్నది ఇంకా బయటకు రాలేదు.
