విజయ్ దేవరకొండ హీరో వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో బోల్డ్ రోల్ చేసిన రాశి ఖన్నా ఆ చిత్రం తరువాత మరో ప్రాజెక్ట్ ప్రకటించలేదు. గత ఏడాది వెంకీ మామ, ప్రతిరోజూ పండగే వంటి వరుస హిట్స్ అందుకున్న ఆమె కెరీర్ వరల్డ్ ఫేమస్ లవర్ తరువాత కొంత డల్ అయ్యింది. స్టార్ హీరోయిన్ అవకాశం దగ్గర పడుతున్న సమయంలో వరల్డ్ ఫేమస్ లవర్ మూవీతో రిస్క్ చేసింది. ఆ మూవీ అనుకున్నంత విజయం సాధించక పోవడంతో పాటు రాశి ఇమేజ్ ని దెబ్బ తీసింది. 

ఆ చిత్రంలో ఆమె చేసిన ఇంటిమసీ సీన్స్ సంచలనం రేపాయి. సినిమా విడుదలకు ముందు మీ ఇమేజ్ కి ఇలాంటి పాత్ర రిస్క్ అనుకుంటా అని కొందరు అడగగా...సినిమా చూస్తే ఆ రోల్ ఔన్నత్యం మీకు తెలుస్తుందని పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. సినిమా ఫలితం తరువాత మాత్రం తప్పు చేశానని రాశి చాలా బాధపడ్డారు. ఆ సినిమా దెబ్బకు స్టార్ హీరోల సంగతి అటుంచితే...నాని, శర్వా నంద్ వంటి టూ టైర్ హీరోలు కూడా ఆమెను ప్రిఫర్ చేయడం లేదు. 

కాగా తమిళంలో రాశి ఖన్నా ఓ క్రేజీ ఆఫర్ పట్టేసింది. వర్సిటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కనున్న తుగ్లక్ సర్కార్ మూవీ కోసం హీరోయిన్ గా రాశి ఖన్నాను తీసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నిర్మాతలు అధికారిక ప్రకటన చేశారు. రెండో సారి విజయ్ సేతుపతికి జంటగా నటించే అవకాశం వచ్చినందుకు రాశి సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని  తెలియజేసింది.