Asianet News TeluguAsianet News Telugu

రాశీఖన్నా టార్చర్ పెట్టింది: 'నగ్నం' హీరోయిన్ ఆరోపణ

 నగ్నం హీరోయిన్ శ్రీ రాపాక..తాజాగా హీరోయిన్ రాశీ ఖన్నాపై సంచలన ఆరోపణలు చేసింది . ఆమె గతంలో క్యాస్ట్యూమ్ డిజైనర్ గా చేసేది.రీసెంట్ గా వర్మ  నిర్మించిన నగ్నం చిత్రంతో నటిగా మారిన ఈ భామ.. వరుస ఇంటర్వ్యూలతో సంచలనం రేపే పనిలో ఉంది. ఏదో ఒక సెన్సేషన్  విషయం లేనిదే మాట్లాడటం లేదు. తాజాగా సుప్రీమ్ సినిమా అప్పుడు ఆ మూవీ హీరోయిన్ రాశీ ఖన్నా తనను వేధించింది అంటూ నాటి విషయాలను షేర్ చేసుకుంది. 

Raashi Khanna tortures and hurts my self-respect
Author
Hyderabad, First Published Jul 9, 2020, 11:29 AM IST

రీసెంట్ గా హేమపై ఆరోపణలు చేసిన నగ్నం హీరోయిన్ శ్రీ రాపాక..తాజాగా హీరోయిన్ రాశీ ఖన్నాపై సంచలన ఆరోపణలు చేసింది . ఆమె గతంలో క్యాస్ట్యూమ్ డిజైనర్ గా చేసేది.రీసెంట్ గా వర్మ  నిర్మించిన నగ్నం చిత్రంతో నటిగా మారిన ఈ భామ.. వరుస ఇంటర్వ్యూలతో సంచలనం రేపే పనిలో ఉంది. ఏదో ఒక సెన్సేషన్  విషయం లేనిదే మాట్లాడటం లేదు. తాజాగా సుప్రీమ్ సినిమా అప్పుడు ఆ మూవీ హీరోయిన్ రాశీ ఖన్నా తనను వేధించింది అంటూ నాటి విషయాలను షేర్ చేసుకుంది. 

శ్రీరాపాక మాట్లాడుతూ.. సుప్రీమ్ సినిమాకి నేను క్యాస్ట్యూమ్ డిజైనర్‌ని. ఆ సినిమాలో హీరోయిన్ రాశీ ఖన్నా. రాత్రి మూడు గంటలకు నన్ను శారీ కట్టడానికి పిలిచింది. ఆ సినిమాకి రాజు సుందరం మాస్టర్ కొరియోగ్రాఫర్. ఆయనతో నేను తమిళ్‌లో కూడా పనిచేశా. బాగా తెలుసు ఆయన. అయితే నువ్వేంటి ఇక్కడ అన్నారు.. రాశీ ఖన్నా శారీ కట్టడానికి పిలుస్తోంది.. అసిస్టెంట్లు కాకుండా నేనే శారీ కట్టాలట అని చెప్పాను. ఈ సినిమా డైరెక్టర్ అనీల్ రావిపూడి ‘పటాస్’ చిత్రానికి కూడా నేను క్యాస్ట్యూమ్ డిజైనర్‌ని.

అయితే రాశీ ఖన్నా టార్చర్ పెడుతుందని ఆయనకు కూడా తెలుసు. కానీ ఎవరూ ఏమీ చెయ్యలేదు. అలా నన్ను టార్చర్ పెట్టేది. ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు కాని.. నన్ను బాగా టార్చర్ చేసింది. ఇంటికి పిలిచి.. వెయిట్ చేయించేది. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ బాగా ఎక్కువ కావడంతో నేను కూలి పనిచేసుకునే దానిలా కనిపిస్తున్నానా ఈమెకు అనుకుని.. నా చదువు ఏంటి.. చేసే పని ఏంటి.. నిఫ్ట్ కాలేజ్‌లో సీటు దొరకడమే గ్రేట్.. అలాంటిది కాలేజ్ టాపర్‌ని నేను. అలాంటిది నన్ను ఇలా చేస్తుందేంటి? అని బాధ కలిగేది.

ఈ విధంగా రాశీఖన్నా విషయంలో నేను చాలా సార్లు బాధ పడ్డాను. ఆ తరువాత ఆమెతో మళ్లీ పనిచేయలేదు. ఆమెతో నేను మాట్లాడే ప్రయత్నం చేయలేదు. వాళ్లు ఓ యాటిట్యూట్‌లో ఉంటారు.. నేను స్టార్‌ని నాకేంటి అనుకుంటారు.  నేను ఏదైనా ఓపెన్‌గా మాట్లాడతా.. అది రాశీ ఖన్నా కావచ్చు.. కాజల్ కావచ్చు.. ఐడోన్ట్ కేర్. వాళ్లు నిజంగా చదువు వచ్చినోళ్లా.. నిఫ్ట్ నుంచి వచ్చిన ఒక అమ్మాయిని చూపించండి. తెలుగులో ముగ్గురే ఉన్నారు.. వాళ్లలో ప్రభాస్ డిజైనర్ భాస్కర్.. పవన్ కళ్యాణ్ డిజైనర్ రాజేష్.. అండ్ శ్రీ రాపాక (నేనే). తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రొఫెషనల్ క్యాస్ట్యూమ్ డిజైనర్స్ మేం ముగ్గురమే అని చెప్పుకొచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios