Asianet News TeluguAsianet News Telugu

Naga Chaitanya: దటీజ్ నాగ చైతన్య, జెంటిల్ మాన్ అంటూ హీరోయిన్ ప్రశంసలు.. అసలు ఏం చేశాడంటే..

నాగ చైతన్య ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీ అవుతున్నాడు. సామ్ తో డివోర్స్ తర్వాత చైతు తన వర్క్ ఫై ఫోకస్ పెట్టాడు. చైతు చివరగా లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాలతో విజయాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Raashi Khanna says naga chaitanya is gentleman
Author
Hyderabad, First Published Jun 27, 2022, 10:27 AM IST

నాగ చైతన్య ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీ అవుతున్నాడు. సామ్ తో డివోర్స్ తర్వాత చైతు తన వర్క్ ఫై ఫోకస్ పెట్టాడు. చైతు చివరగా లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాలతో విజయాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇకపై కూడా విజయ పరంపర కొనసాగించాలని చూస్తున్నాడు. 

ప్రస్తుతం నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం 'థాంక్యూ'. మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతు నటిస్తున్న చిత్రం ఇది. ఈ మూవీలో చైతూకి జోడిగా రాశి ఖన్నా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్స్, సాంగ్స్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. జూలై 22న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. 

దీనితో చైతు, రాశి ఖన్నా ప్రమోషన్స్ షురూ చేస్తున్నారు.  వీరిద్దరూ ప్రమోషన్స్ షూట్ కోసం రెడీ అవుతున్న టైంలో ఇంటరెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఈ సంగతిని రాశి ఖన్నా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. దీనితో చై అభిమానులు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

అసలు ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ప్రమోషన్స్ షూట్ లో భాగంగా ఫోటో షూట్ చేస్తున్నారు. రాశి ఖన్నా నాలుగు అంగుళాలు పొడవు ఉండే హీల్స్ ధరించింది. దీనితో షూట్ లో రాశి చై కంటే కొంచెం పొడవుగా కనిపిస్తోంది. నాగ చైతన్య హైట్ ని మ్యాచ్ చేసేందుకు రాశి ఖన్నా కొంచెం బెండ్ అవుతూ ఇబ్బంది పడుతూ కనిపించింది. 

దీనితో చైతు 'నువ్వు నార్మల్ గానే ఉండు.. బెండ్ కావాల్సిన అవసరం లేదు' అనూ రాశి ఖన్నాకి చెప్పాడు. ఈ వీడియో రాశి ఖన్నా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నాగ చైతన్య నిజమైన జెంటిల్ మాన్ అని ప్రశంసలు కురిపించింది. దీనితో నాగ చైతన్య అభిమానులు ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios