ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ లో స్వీట్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న రాశిఖన్నా కొద్దికాలానికే గ్లామర్ తో వెండి తెరపై వేడి పెంచేసింది. అయితే బేబీ ఎంత మంది స్టార్ హీరోలతో వర్క్ చేస్తున్న స్టార్ హీరియిన్స్ రేంజ్ లో క్లిక్కవ్వడం లేదు. రీసెంట్ గా వచ్చిన కుర్ర హీరోయిన్స్ చేతి దగ్గరికి వచ్చిన అవకాశాల్ని ఎగరేసుకుపోతున్నారు. 

ఇక మొత్తానికి మీడియం హీరోలతో అవకాశాలు అందుకుంటూ కెరీర్ ను నెట్టుకొస్తోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే అమ్మడు నెక్స్ట్ రవితేజ సినిమాలో కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వెంకీ మామ సినిమాలో నాగ చైతన్య కు జోడిగా నటిస్తున్న రాశి ఆ సినిమాను ఫినిష్ చేసే పనిలో ఉంది. గతంలో బెంగాల్ టైగర్ సినిమాలో రవితేజతో ఈ బేబీ కలిసి నటించింది.  

మళ్ళీ ఇన్నాళ్లకు మాస్ రాజాతో వర్క్ చేయడానికి ఒప్పుకుంది. అజయ్ భూపతి డైరెక్షన్ లో రవితేజ - రాశి ఖన్నాల కొత్త చిత్రం తెరకెక్కనుంది. మహా సముద్రం అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. మరికొన్ని రోజుల్లో రవితేజ ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. వీలైనంత త్వరగా షూటింగ్ ని మొదలుపెట్టి 2020 సమ్మర్ అనంతరం సినిమాను రిలీజ్ చేయాలనీ దర్శకుడు ప్లాన్ చేసుకుంటున్నాడు.