టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాశిఖన్నా స్టార్ స్టేటస్ ని మాత్రం అందుకోలేకపోతుంది. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో నటించినా కానీ ఆమెకి సరైన గుర్తింపు రాలేదు. ఆమె తోటి హీరోయిన్లు స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతుంటే రాశి మాత్రం అవకాశాల కోసం ఫోటోషూట్లలో పాల్గొంటోంది.

అయితే ప్రస్తుతం మాత్రం ఈ బ్యూటీ మూడు చిత్రాల్లో  నటిస్తోంది.  వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌, వెంకీ మామ, ప్రతి రోజు పండగే చిత్రాల్లో నటిస్తోన్న రాశి.. విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తోన్న 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకుంది. విజయ్ దేవరకొండతో నటించిన రష్మిక స్టార్ హీరోయిన్ గా మారి మహేష్ లాంటి హీరోల సరసన నటిస్తోంది.

ఇప్పుడు 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా కూడా హిట్ అయితే గనుక రాశికి క్రేజ్ రావడం ఖాయమని భావిస్తోంది. తన కెరీర్ లో సక్సెస్ ఫుల్ చిత్రాలు ఉన్నప్పటికీ కెరీర్ ని మలుపు తిప్పే సినిమా మాత్రం పడలేదు. విజయ్ దేవరకొండ సినిమా గనుక సెన్సేషన్ అయితే రాశి దశ తిరగడం ఖాయం.

సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్లు ఉన్నప్పటికీ రాశిది మెయిన్ రోల్ కావడంతో ఈ సినిమాపై హోప్స్ పెట్టుకుంది. ఈ సినిమాతో తాను కూడా ఫేమస్‌ అయిపోయి మహేష్‌, అల్లు అర్జున్‌ లాంటి హీరోల నుంచి పిలుపు వస్తుందని రాశి ఆశిస్తోంది.