దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని టాలీవుడ్ డైరెక్టర్స్ డేగా సెలెబ్రేట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్ లో ప్రముఖ దర్శకులు, టాలీవుడ్ తారలు హాజరయ్యారు.

దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని టాలీవుడ్ డైరెక్టర్స్ డేగా సెలెబ్రేట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్ లో ప్రముఖ దర్శకులు, టాలీవుడ్ తారలు హాజరయ్యారు. దాసరి నారాయణ రావుని తన గురువుగా భావించే ప్రముఖ నటులు ఆర్ నారాయణమూర్తి కూడా హాజరయ్యారు. 

నారాయణమూర్తి వేదికపై మాట్లాడుతూ లేటెస్ట్ సెన్సేషన్ బలగం చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఎక్కడ చూసినా బలగం బలగం అని వినిపిస్తోంది. వార్ అండ్ పీస్ చిత్రం చూసి చాలా దేశాలు సంధి చేసుకున్న సంఘటనలు మనకి తెలుసు. ఇప్పుడు బలగం కుటుంబాల మధ్య అంత ప్రభావం చూపిస్తోంది. 

బాహుబలి రిలీజైన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ నుంచి.. తెలంగాణాలో జానా రెడ్డి వరకు అంతా బాహుబలి బాహుబలి అని జపం చేశారు. ఆ మధ్యన దేశ విదేశాల్లో తగ్గేదేలే అంటూ పుష్ప చిత్రం ప్రభావం చూపింది. 

ఆ స్థాయిలో బలగం పేరు వినిపిస్తోంది. నిర్మాత దిల్ రాజు గారికి నా హ్యాట్సాఫ్. ఈ చిత్ర దర్శకుడు తమ్ముడు వేణుకి శిరసు వంచి నమస్కరిస్తున్నా అంటూ నారాయణ మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి గారి ఖ్యాతితో, కీరవాణి గారి సంగీతంతో, చంద్రబోస్ లిరిక్స్, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీతో.. చరణ్, ఎన్టీఆర్ డ్యాన్స్ తో నాటు నాటు సాంగ్ ప్రపంచం మొత్తాన్ని దడ దడ లాండించింది. ఆస్కార్ సాధించింది. 

పారసైట్ అనే విదేశీ చిత్రానికి కూడా ఆస్కార్ ఇచ్చారు. అదే తరహాలో మనం అంతా సపోర్ట్ చేసి బలగం చిత్రాన్ని కూడా ఆస్కార్స్ కి పంపాలి అని ఆర్ నారాయణమూర్తి డిమాండ్ చేశారు. ఆర్ నారాయణమూర్తి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే బలగం చిత్రం అంతర్జాతీయంగా అవార్డులు కొల్లగొట్టడం ప్రారంభించిన సంగతి తెలిసిందే.