టాలీవుడ్ లో ఒక సిద్ధాంతాన్ని నమ్మి సినిమాలు తీసే వ్యక్తి ఆర్.నారాయణమూర్తి. విప్లవ స్వభావంతో ఎన్నో సినిమాలు చేసి ఎర్రన్న అని జనల చేత ముద్దుగా పిలిపించుకునే ఆయన పలు సందర్భాల్లో సమస్యలపై కుడా తన గళాన్ని విప్పుతారు. రీసెంట్ గా లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమాపై సెన్సార్ బోర్డు ప్రవర్తించిన తీరుపై మూర్తిగారు స్పందించారు. 

పసుపులేటి రామారావుగారు శ్రీదేవిపై రాసిన పుస్తకావిష్కరణలో పాల్గొన్న ఎర్రన్న వర్మకు మద్దతు పలుకుతూ శ్రీదేవిని గుర్తు చేసుకున్నారు. గతంలో ఒకసారి తన సినిమాకు సెన్సార్ సమస్య తలెత్తినప్పుడు ముంబయి వెళితే ఆమె నన్ను గౌరవంగా ఆహ్వానించారు. మీ సినిమాలో నటించాలని ఉందని మీ విప్లవ సినిమాలు అంటే చాలా ఇష్టమని చెప్పి సెన్సార్ పనుల్లో సహాయాన్ని అందించారు. 

అలాంటి మహానుభావురాలు ఇప్పుడు ఉంటే కన్నీరు పెట్టుకునే వారు అంటూ ఎవరో కంప్లైంట్ ఇస్తే సినిమాను నిలిపివేయాలా? సెన్సార్ జరగనివ్వరా? అని అన్నారు. ఈ విధంగా సెన్సార్ బోర్డ్ అనవసరంగా నిబంధనలను పెట్టడం సరికాదని దీనిపై ఇండస్ట్రీలో అందరూ స్పందించాలని నారాయణ మూర్తిగారు తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.