ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని హీరోగా, తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో బైలింగ్వల్‌ చిత్రం రూపొందుతుంది. ఇందులో ఆర్‌ మాధవన్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. దీంతో దీనిపై స్పందించారు మాధవన్‌.

ఒకప్పటి లవర్‌ బాయ్‌.. ఆర్‌ మాధవన్‌ ఇప్పుడు హీరోగానే కాదు స్పెషల్‌ రోల్స్ కి కేరాఫ్‌గా నిలుస్తున్నారు. ఆయన తెలుగులో `సవ్యాసాచి`, `నిశ్శబ్దం` వంటి చిత్రాల్లో నెగటివ్‌ రోల్స్ చేశారు. ఇప్పుడు మరోసారి నెగటివ్‌ రోల్‌ చేయబోతున్నారనే వార్తలు వినిపించాయి. ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని హీరోగా, తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో బైలింగ్వల్‌ చిత్రం రూపొందుతుంది. `ఉప్పెన` ఫేమ్‌ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. 

ఇందులో ఆర్‌ మాధవన్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారనే వార్తలు సోషల్‌ మీడియాలో గుప్పుమన్నాయి. దీంతో తాజాగా దీనిపై స్పందించారు మాధవన్‌. అందులో వాస్తవం లేదన్నారు. `లింగుస్వామి అద్భుతమైన దర్శకుడు. ఆయన దర్శకత్వంలో పనిచేయాలని నాకూ ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఆయన చిత్రంలో నేను నటించడం లేదు. ఆయన తెలుగులో రూపొందిస్తున్న సినిమాలో నేను విలన్‌గా నటిస్తున్నారని వస్తోన్న వార్తలో నిజం లేదు. కేవలం పుకార్లు మాత్రమే` అని తెలియజేస్తూ ట్వీట్‌ చేశారు.

Scroll to load tweet…

ఆయన నటించిన `సఖి` చిత్రం తెలుగులో ఎంతటి పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ప్రస్తుతం మాధవన్‌ `రాకెట్రీ` చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు `అమృకి పండిత్‌` సినిమాలో నటిస్తున్నారు.